Nellore News : నెల్లూరులో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థినికి అబార్షన్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే యువతి మృతిచెందింది. మర్రిపాడు మండలానికి చెందిన యువతి(19) ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. ఏప్రిల్ 11న విద్యార్థులంతా కాలేజీ ఆవరణలో ఉండగా... ఆ యువతి క్లాస్ రూమ్ లో ఉండిపోయి గడియపెట్టుకుంది. ఎంతసేపటికీ ఆ విద్యార్థిని బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు తలుపులు పగలగొట్టారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉంది యువతి. ఆమె పక్కనే ఆరు నెలల గర్భస్థ పిండం కనిపించింది. వెంటనే విద్యార్థులు యువతిని, పిండాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువతి మరణించిందని వైద్యులు నిర్థారించారు.
అసలేం జరిగింది?
నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని అబార్షన్ కారణంగా క్లాస్ రూమ్ లో మృతిచెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11న కాలేజీ విద్యార్థులందరూ ప్రాంగణంలో ఉండగా యువతి గదిలో ఉండిపోయి తలుపులు వేసుకుంది. దీంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా.. తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె పక్కనే ఆరు నెలల పిండాన్ని గుర్తించారు. వెంటనే తోటి విద్యార్థులు తల్లిని, పిండాన్ని స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లాస్ రూమ్ లో అబార్షన్ అయ్యిందా? లేక వీడియో చూసి తానే అబార్షన్ చేసుకుందా? అనే కోణలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి సెల్‌ఫోన్ ఆధారంగా అనంతసాగరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మ్యాచింగ్ సెంటర్ లో భార్యపై భర్త దాడి
ఆడవాళ్లతో షాపింగ్‌కు వెళ్తే మగవాళ్లకు ఎలాంటి నరకం ఉంటుందో చాలా సినిమాల్లో కామెడీగా చూపించారు. కానీ అలాంటి సీన్లు సీరియస్ అయితే ఎంత భయంకరంగా ఉంటాయో తాజాగా ఓ ఘటన చెబుతోంది. కరీంనగర్ టౌన్‌లో ఉన్న టవర్ సర్కిల్ మ్యాచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. ఈ ఏరియాలోఉన్న మయూరి మ్యాచింగ్ సెంటర్ కు ఇద్దరు భార్యభర్తలు వచ్చారు. ఏమయిందే ఏమో కానీ కాసేపటికి ఆ భార్య కడుపులో కత్తెర దిగింది. ఆమె అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. భర్త అక్కడ్నుంచి పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న ఆ మ్యాచింగ్ సెంటర్ నిర్వహకులు చెప్పిందేమిటంటే.. భర్తనే కత్తెర తీసుకుని భార్యను పొడిచి పారిపోయాడు.
దుకాణానికి వచ్చేంత వరకూ ఆ భార్యభర్తలు బాగానే ఉన్నారని.. అన్యోన్యంగానే ఉన్నారని దుకాణం యజమానులు చెబుతున్నారు. అయితే.. షాపింగ్ ప్రారంభించిన తర్వాత ఎంతకూ తనకు కావాల్సిన మ్యాచింగ్ దొరకలేదని చెప్పి అదే పనిగా ఆమె సమయం వేస్ట్ చేస్తూండటంతో భర్తకు కోపం వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరగా తేల్చాలని భర్త అంటూంటే.. నింపాదిగా ఆమె అన్ని మ్యాచింగ్ పీసులనూ చూస్తూండటంతో... భర్తకు కోపం వచ్చిందని అంటున్నారు. కోపం పట్టలేక అందుబాటులో ఉన్న కత్తెర తీసుకుని దాడి చేసినట్లుగా చెబుతున్నారు. భార్యకు కరెక్టుగా కడుపులో కత్తెర గుర్చుకుంది. రక్తస్రావం కారకుండా చున్నీ కట్టి వెంటనే ఆస్పత్రికి తరలించారు.