టీనేజీ పిల్లలు ఈ మధ్య కాలంలో ఏ విషయానికి ఎలా స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు. కొన్ని సందర్భాలలో వారు క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు చిన్నారులు మార్కులు తక్కువగా వచ్చాయనో, లేదా మరో కారణాలతో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగ తనువు చాలిస్తున్నారు. కొందరు చిన్నారులు తల్లిదండ్రులను సైతం హత్య చేసి తమకేమీ తెలియదని అమాయకంగా ప్రవర్తిస్తున్నారు. నవీ ముంబయిలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలు తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. కన్నతల్లిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.


నవీ ముంబయిలోని కూతురు (15), కుమారుడు (6)తో కలిసి సెక్టర్ 7, ఎయిరోలీలో 41 ఏళ్ల మహిళ, ఆమె భర్త నివాసం ఉంటున్నారు. తండ్రి ఇంజినీర్ కాగా, తల్లి ఇంటి దగ్గరే ఉండేవారు. ఈ క్రమంలో కూతురు చదువు విషయంలో తల్లిదండ్రులు కాస్త ఆందోళన చెందేవారు. మంచి మార్కులు తెచ్చుకోవాలని తమ పేరు నిలబెట్టాలని తల్లిదండ్రులు ఆ బాలికకు చెప్పేవారు. ఇటీవల ఆ బాలిక పదో తరగతి పాస్ అయింది. అయితే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే జీవితం ఉంటుందని మరోసారి చెప్పారు. ఆ తరువాత మెడికల్ కోర్సులు తీసుకుని పేరు సంపాదించాలని కూతురిపై వారు ఒత్తిడి తీసుకొచ్చారు. 
Also Read: అటవీ ప్రాంతంలో తగలబడిన కారు... డిక్కీలో చూస్తే రియల్టర్ డెడ్‌బాడీ... మెదక్‌లో ఆందోళన కలిగించిన సంఘటన


తనకు చదువు విషయంలో ఎలాంటి ఆసక్తి లేదని టీనేజీ కూతురు చెప్పడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అలా మాట్లాడకూడదని కూతురుకి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఏ ప్రయోజనం కనిపించడలేదు. డాక్టర్ అవుతాయని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేస్తావని ఊహించలేదంటూ తండ్రి అనేసరికి కుమార్తె తట్టుకోలేకపోయింది. జులై 27న కుమార్తె సెల్‌ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే తండ్రి ఆమెను మందలించగా.. చదువు విషయంలో తల్లిదండ్రులతో బాలిక గొడవ పడింది. చదువుకోవాలని ఒత్తిడి చేస్తున్న తల్లిదండ్రులపై కోపం పెంచుకుంది. జులై 30న మధ్యాహ్నం మరోసారి గొడవ జరిగింది. కెరీర్‌పై శ్రద్ధ చూపించాలని కూమార్తెకు తల్లి సర్దిచెప్పే ప్రయత్నంగా చేయగా వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో తల్లి చనిపోయింది. అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. చుట్టుపక్కల వారిని, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. తండ్రికి వాట్సాప్‌లో మెస్సేజ్ సైతం చేసింది.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకుందని విచారణలో ఒకసారి చెప్పగా, ఎవరో హత్య చేసి ఉంటారని మరోసారి చెప్పింది. ఒక్కోసారి ఒక్కో తీరుగా కూతురు బదులివ్వడంతో ఆమెపై అనుమానం మొదలైంది. కొన్ని రోజుల నుంచి జరిగిన విషయాలు తెలుసుకున్న పోలీసులు నిజం చెప్పాలని విద్యార్థిని మరోసారి ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. ఆరోజు ఇంట్లో అమ్మ తన చదువు గురించి ఒత్తిడి తెచ్చిందని, కత్తి చూపించి తనను బెదిరించిందని వెల్లడించింది. తనకు ఏం చేయాలో అర్థంకాక తల్లిపై దాడి చేసి, కరాటే బెల్టుతో గొంతునులిమి చంపేసినట్లు అంగీకరించడంతో పోలీసులతో పాటు కుటుంబసభ్యులు షాకయ్యారు. ఆ బాలికను జువెనైల్ బోర్డుకు తరలించారు. చదువు గురించి ఒత్తిడి చేస్తే ఎంత పనిచేశావంటూ తండ్రి కన్నీటి పర్యంటమయ్యారు.
Also Read: Telangana ACB: లంచాల కలెక్షన్ కోసం వాట్సాప్‌ గ్రూప్‌.. ఏవో తెలివితేటలకు బిత్తరపోయిన ఏసీబీ అధికారులు