Cyber Crime : రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు కొందరు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ సైబర్ నేరాలకు బాధితులు అవుతున్నాయి. తాజాగా ఓ కేటుగాడు ఏకంగా కలెక్టర్‌ ఫొటో వాడేసి డబ్బు కొట్టేశాడు. కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్‌ ఖాతా ఓపెన్ చేసి పలువురికి మేసెజ్ పంపి రూ.2.4 లక్షలు కొట్టేశాడు. ఎస్పీ వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నంబర్‌ తో నారాయణపేట్ కలెక్టర్‌ దాసరి హరిచందన ఫొటోతో వాట్సాప్‌ ఖాతా తెరిచి, దానితో పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు మెసేజ్ లు పంపించాడు. 


Also Read : Kamareddy Case: తల్లీకొడుకుల ఆత్మహత్య - రామాయంపేట మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు


కలెక్టర్ ఫొటోతో నకిలీ ఖాతా


ఈ సందేశాలతో ఓ వ్యక్తి అమెజాన్‌ పే యాప్‌ ద్వారా పలు దఫాలుగా రూ.2.4 లక్షలు సైబర్‌ నేరగాడు వేయించుకున్నాడు. కలెక్టర్ ఫొటో ఖాతాను సందేశాలు వచ్చిన అధికారులు విషయాన్ని ఆరా తీయగా నకిలీ ఖాతా అని తేలింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్‌సీఆర్‌పి పోర్టల్‌ ద్వారా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వాట్సాప్‌ నంబర్‌కు జిల్లా అధికారులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దాని నుంచి వచ్చే సందేశాలు నమ్మొద్దని కలెక్టర్‌ హరిచందన కూడా స్వయంగా తెలిపినట్లు సమాచారం. ఈ నంబర్ నుంచి ఎవరికైనా మెసేజ్ లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేక్ వాట్సాప్‌ ఖాతాతో మోసం చేసిన వ్యక్తి జార్భండ్‌ రాష్ట్రానికి చెందినవాడుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అధికారుల ఫొటోలు పెట్టి డబ్బులు అడుగుతున్నారని, అలా ఎవరైనా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సైబర్‌ నేరాల నుంచి రక్షణకు టోల్‌ఫ్రీ నం.1930 కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. ఇలాంటి నకిలీ ఖాతాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 


Also Read : Kalyanadurgam News : మంత్రి ర్యాలీలో పోలీసుల అత్యుత్సాహం, సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి!


Also Read : Guntur Crime : రెండేళ్ల బాలుడు పక్కనే ఏడుస్తూ, మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం!