Kurnool News : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం రాయపాడు నుంచి గగ్గటూరు  బ్రిడ్జి దాటుతున్న క్రమంలో కారు వాగులో కొట్టుకుపోయింది. కర్నూలు నగరానికి చెందిన నలుగురు మిత్రులు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం కోసం మిత్రులు కారులో ప్రయాణిస్తున్నారు. వాగు దాటుతున్న క్రమంలో  కారు కొట్టుకుపోతుండడంతో స్థానికులు గమనించి నలుగురిని రక్షించే ప్రయత్నం చేశారు. కారును గమనించి అద్దాలు పగలగొట్టి నలుగురిని బయటికి తీసిలోపు ఒక్కరు అప్పటికే మరణించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ చూసినా వాగులు, వంకలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులను ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు. 


ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం 


వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో వచ్చే 48 గంటల్లో  అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తారంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. 






Also Read : Minister Roja : మంత్రి రోజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోల్ కతా అమ్మాయి


Also Read : Nellore News : నెల్లూరు జిల్లాలో దారుణం, తల్లి, కూతురు అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య!