Minister Roja : సాధారణంగా విమానాల్లో ప్రయాణాలు హడావుడిగా సాగుతూ ఉంటాయి. తమ గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటామో అనే ధోరణిలోనే ఎక్కువ మంది ఉంటారు. బిజీబిజీ లైఫ్ లో ఆగి ఆప్యాయంగా పలకరించే వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. పలకరించిన వారిని తనదైన శైలిలో ఆప్యాయత చూపుతూ, యోగ క్షేమాలు అడిగి తెలుసుకునే వారిలో ఏపీ మంత్రి ఆర్.కె.రోజా ఒకరు. విశాఖపట్నం నుంచి తిరుపతికి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ అభిమానిని పలకరించారు. ఆమె మంత్రి రోజాకు ఓ లేఖ రాశారు. ఆ లేఖను మంత్రి రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అభిమాని రాసిన లేఖను పోస్టు చేసిన మంత్రి
సమాజంలో ఆధునికత పెరిగే కొద్ది మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. సాధారణంగా సినీనటులు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు. ఇక మరి ముఖ్యంగా సమాజసేవలో ఎప్పుడూ ముందుండే వారికి సైతం అభిమానులు ఎంతో మంది ఉంటారు. సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎప్పుడూ బిజీబిజీగా ఉండే మంత్రి ఆర్.కె.రోజా ఎప్పుడూ తన అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంచారు. విశాఖపట్నం నుంచి తిరుపతికి విమానంలో బయలుదేరిన రోజాకు తన అభిమాని ఎదురుపడింది. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరైన రోజా, విశాఖ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో ప్రయాణం సాగిస్తుండగా ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న కలకత్తాకు చెందిన ప్రియాంక మంత్రి ఆర్.కె.రోజాను పలకరించింది. తాను అభిమానిని అని పరిచయం చేసుకుంది. మంత్రి రోజా చేస్తున్న సేవ కార్యక్రమాలకు ఆకర్షితురాలు అయ్యాయని ఓ ప్రియాంక ఓ లేఖ రాసి తన అభిమానం చాటుకుంది. అంతే కాకుండా మంత్రి రోజాతో సెల్ఫీ దిగింది. తననూ ఎంతో అభిమానంగా పలకరించిన అభిమాని ప్రియాంకకు ఇచ్చిన సెల్ఫీ, లేఖను స్వయంగా ఆర్.కె.రోజా తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ లేఖలో ఏముందంటే?
'మిమల్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను. నటిగా అభిమానుల మనసును గెలుచుకోవడమే కాకుండా, ఓ ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అతి దగ్గరగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. మీరు నా అభిమాన నటి. మీరు మరెన్నో సేవలు అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.' అని ప్రియాంక లేఖలో రాశారు. తాను ఎంతగానో అభిమానించే రోజా తాను డ్యూటీ చేస్తున్న విమానంలో ప్రయాణించడం తనకు ఎంతగానో తృప్తిని ఇచ్చిందని ప్రియాంక లేఖలో రాశారు.