Mother killed two children by adding rat poison in tea :  చిన్న ఆవేశంలో చేసే పనుల వల్ల కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. పిల్లల ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయన్న సంగతిని నష్టం జరిగిన తర్వాతనే గుర్తిస్తారు. ఇలాంటి ఘటనలో పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకుంది.  మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు…. కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 


భర్త పిల్లలకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చిన మహిళ                                          


మాచర్ల మండలం నారాయణపురం తండా చెందిన రవి నాయక్, తన అక్క కూతురినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.. కాగా వృత్తి రీత్యా రవి నాయక్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నారని, వారానికో, పది రోజులకు, వచ్చి కుటుంబంతో గడిపే వారిని సమాచారం. ఈ నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పుట్టింటికి వెళ్తానని చెప్పింది భార్య వసంత. దీన్ని వ్యతిరేకించాడు భర్త రవి నాయక్. దీంతో భర్తతో తీవ్రవాగ్వదానికి దిగింది వసంత. ఆగ్రహం తట్టుకోలేక తాగుతున్న టీలో ఎలుకల మందు కలిపించింది.


చనిపోయిన పిల్లలు                               


కన్నతల్లి కోపంతో టీలో ఎలుకల మందు కలిపించిందన్న విషయాన్ని తెలుసుకోలేని ఆ చిన్నారులు టీని సేవించడం, ఆ తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరటం అక్కడ ఒక్కొక్కరుగా చికిత్స పొందుతూ మృత్యువాత పట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు రమావత్ భాను ప్రకాష్, రమావత్ ఈశ్వర్‌లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో రెండేళ్ల వయస్సు ఉన్న ఈశ్వర్ మృతిచెందగా, సోమవారం రామావత్ భాను ప్రకాష్‌ను చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో, మిర్యాలగూడ సమీపంలో మృతి చెందారు.


ఆస్పత్రిలో భర్త                                   
 
టీ రుచిలో తేడా రావటంతో టీ తాగిన రవి నాయక్ ఆ టీని పక్కన పడేశాడు. దీంతో రవి నాయక్‌కు ప్రస్తుతం ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్లు చెప్పారు. భర్త రవి నాయక్ భార్య వసంతతో పాటు మరొక చిన్నారి ఈశ్వర్ నాయక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్షణికాలం ఆవేశంతో ఇద్దరు బిడ్డల ఉసురు తీసిన కన్నతల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఈ ఘటన పలువురి కంట తడి పెట్టించింది.