Wedding Bells Are Ringing :  కొత్త ఏడాదిలో పెళ్లిళ్లకు వేళైంది.  పెళ్లిళ్లకు ముహుర్తాలు ప్రారంభమవుతుండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభమవుతుండడంతో వివాహాలు చేసుకునేందుకు ఎన్నో జంటలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వేలాది జంటలు ముహుర్తాలు పెట్టుకోగా, ప్రముఖ ఆలయాలైన తిరుపతి, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవాలయాల్లో వివాహాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 11న ప్రారంభం కానున్న వివాహాలు.. ఏప్రిల్‌ 26 వరకు కొనసాగనున్నాయి. రానున్న మూడు నెలల్లో 30 వరకు మంచి ముహుర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా జంటలు సిద్ధమవుతున్నాయి. మూడు నెలలు తరువాత మూఢం, శూన్యమాసం వస్తుండడంతో మధ్యలో పెళ్లిళ్ల ముహూర్తాలకు బ్రేక్‌ పడనుంది. ఆ తరరువాత మళ్లీ శ్రావణంలోనే మంచి ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. 


Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!


లక్షల వివాహాలు


ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే శుభ ముహుర్తాలు.. మూడు నెలలపాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 26 వరకు లక్షల జంటలు ఒక్కటయ్యే అవకాశముంది. ఒక్కో ముహర్తానికి రాష్ట్రంలో కనీసం పది వేలకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లు నిశ్చమైన వారు ఇప్పటికే.. ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. వివాహాలు చేసుకునే వారి స్థోమతను బట్టి బ్యాండ్‌ నుంచి ఫుడ్‌ వరకు, పంతులు నుంచి అప్పగింతలు వరకు అన్ని రకాల పనులు పూర్తి చేసేందకు అనుగుణమైన సంస్థలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ల ముహుర్తాలు ప్రారంభం తరువాత ఈ తరహా వ్యాపారాలు జోరందుకోనున్నాయి.


Also Read: శివభక్తులకు వరాలు ఈ క్షేత్రాలు - అన్నీ ఏపీలోనే ఉన్నాయ్!