Maoists Set Bus on Fire in Chitnoor: చాలా రోజుల తరువాత మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి రెచ్చిపోయిన మావోయిస్టులు అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District Andhra Pradesh) చింతూరు ఏజెన్సీలో ఓ బస్సును తగలబెట్టారు. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు, ప్రయాణికులను కిందకి దించి నిప్పుపెట్టారు. బస్సు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. 


ఏజెన్సీలో అర్దరాత్రి భయం భయం.. 
అసలేం జరిగిందంటే.. మావోయిస్టులు దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చింతూరు మండలం కొత్తూరు వద్ద మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సును అడ్డగించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి డీజిల్ పోసి దగ్ధం చేశారు. దీంతోపాటు కరపత్రాలను సైతం వదిలి వెళ్లారని ప్రయాణికులు పోలీసులకు తెలిపారు. మావోయిస్టులు బస్సును తగలబెట్టడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు సర్వేల గ్రామంలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం చింతూరుకు చేరుకున్నారని పోలీసులుల వెల్లడించారు.


ఘటనా స్థలానికి చిట్నూరు పోలీసులు.. 
దాదాపు 100 మంది మావోయిస్టులు కుటూరు గ్రామం సమీపంలో తలదాచుకుంటున్నారు. వీరు ఒక్కసారిగా రోడ్డు బ్లాక్ చేసి దౌర్జన్యం చేశారు. తమను బస్సు నుంచి దించేసి బస్సుకు నిప్పుపెట్టారని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులో మొత్తం 40 నుంచి 50 వరకు ప్రయాణిస్తున్నారు. బస్సును తగలబెట్టడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 


ప్రయాణికులు, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న చిట్నూరు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అయితే బస్సు దగ్దం చేసిన ఘటనలో కొందరు గాయపడ్డారని తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్రమత్తమైన పోలీసులు దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.


Also Read: Family Suicide Attempt: విజయవాడ లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం, పోలీసులు సకాలంలో స్పందించడంతో !


Also Read: Hyderabad: మగవారికి మహిళలతో బాడీ మసాజ్! స్పా సెంటర్ పై ఆకస్మిక దాడులు