మణిపూర్‌లో రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ కు చెందిన ఒక ట్రాఫికర్‌ను అరెస్టు చేసినట్లు అస్సాం రైఫిల్స్ తెలిపింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన మోరే బెటాలియన్ సరిహద్దు పట్టణమైన మోరేలో మణిపూర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. 54 కిలోల బ్రౌన్ షుగర్, 154 కిలోల మెథాంఫెటమైన్(ఐస్ మెత్) డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మయన్మార్‌కు చెందిన డ్రగ్స్ వ్యాపారిని అరెస్టు చేశారు.
Also Read: జియో, ఎయిర్‌టెల్, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే!
అస్సాం రైఫిల్స్-మణిపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
ఈ జాయింట్ ఆపరేషన్ పై అస్సాం రైఫిల్స్-మణిపూర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. క్రాస్ బోర్డర్ నార్కో-టెర్రరిజం, తిరుగుబాటును ఎదుర్కోవడంలో అస్సాం రైఫిల్స్ ముందంజలో ఉందని ప్రకటనలో తెలిపింది. "ఈ నార్కో-టెర్రరిజం తీవ్రవాద గ్రూపులకు ఆర్థిక వనరుగా మారింది. ఈశాన్య రాష్ట్రాల్లోని యువతకు మాదక ద్రవ్యాలను వ్యసనంగా మారుస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదానికి ఆజ్యం పోసేందుకు కూడా ఇది కూడా ఒక కారణం’’ అని పేర్కొన్నారు.
Also Read: క్రిప్టోలన్నీ లాభాల్లోనే..! రూ.3లక్షల కోట్లు పెరిగిన ఎథిరియమ్ మార్కెట్ విలువ
సీఎం బీరేన్ సింగ్ అభినందన
ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ డ్రగ్స్ స్పందించారు. డ్రగ్స్ పట్టుకున్నట్లు భద్రతా బలగాలను అభినందించారు. "టెంగ్నౌపాల్ పోలీసులు, 43 అస్సాం రైఫిల్స్ అద్భుత విజయం సాధించాయి. మోరేలోని ఒక గిడ్డంగి నుంచి రూ.500 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. విశ్వసనీయ సమచారంతో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ దేశీయుడిని అరెస్టు చేసింది." అని సీఎం బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు. ఓ గిడ్డంగిలో 3716 హెరాయిన్ సబ్బులు, 152 క్రిస్టల్ మెత్ (మెథాంఫేటమిన్) డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వార్ ఆన్ డ్రగ్స్’ చొరవ కింద డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని సీఎం ట్వీట్ చేశారు.
Also Read: ఒక్కరోజే రూ.3.3 లక్షల కోట్ల లాభం..! సెన్సెక్స్, నిఫ్టీ దూకుడే దూకుడు..!