మెటా(ఇంతకుముందు ఫేస్ బుక్) కంపెనీపై భారీగా దావా పడింది. యూకే, యూఎస్‌లో ఉన్న రొహింగ్యాలు ఈ మేరకు ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా దావా వేశారు. మయన్మార్ లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం జరిగిందని వారి ఆరోపణ. ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్ బుక్ విఫలమైందని రోహింగ్యాలు చెబుతున్నారు. అంతేగాకుండా.. తమపై వ్యతిరేకంగా.. హింసను ప్రేరేపించేలా వచ్చిన కంటెంట్ కు సంబధించి.. కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తున్నారు. దాని కోసమే.. నష్ట పరిహారం కింద మెటా నుంచి 150 బిలియన్ డాలర్లు(రూ.10 లక్షల కోట్లపైనే) దావా వేశారు!
యూకేకు చెందిన ఎడెల్‌సన్ పీసీ, ఫీల్డ్స్ పీఎల్‌ఎల్‌సీ అనే.. లీగల్ కంపెనీలు.. రొహింగ్యాలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్ ప్రచారాలను కోర్టుకు సమర్పించాయి. ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా న్యాయస్థానంలో పిటిషన్ వేశాయి. లండన్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయానికి కూడా నోటీసులు పంపించారు.
2017లో మిలిటరీ ఆక్రమణ టైమ్ లో అనేక మంది చనిపోవడం, అత్యాచార ఘటనలు జరిగాయి. భయంతో ఏడున్నర లక్షల మంది రొహింగ్యాలు దేశం విడిచి వెళ్లారు. ఫేస్‌బుక్ ద్వారా జరిగిన ప్రచారమే దీనికి కారణమని ప్రధాన ఆరోపణ. ఈ ఘటనపై 2018లో ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల దర్యాప్తు బృందం విచారణ చేసింది. హింసకు ఫేస్‌బుక్ ద్వారా జరిగిన ప్రచారమేనని తేల్చారు. అంతేగాకుండా.. ఓ మీడియా సంస్థ చేపట్టిన దర్యాప్తులో వెయ్యికిపైగా పోస్టులు, కామెంట్లు, రొహింగ్యాల మీద దాడుల ఫొటోలు బయటపడ్డాయి.
మరోవైపు ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హ్యూగెన్ బయటకొచ్చి.. డాక్యుమెంట్లు లీక్ మాట్లాడం కూడా చేశారు. పలు దేశాల్లో విద్వేషపూరిత సమాచారాన్ని కట్టడి చేయడానికి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఇవన్నీ ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా నడిచాయి. మయన్మార్ మిలటరీ కూడా విద్వేషపూరిత సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఈ దావాపై ఫేస్ బుక్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఈ రోహింగ్యాల ఘటనపై 2018లోనే ఓ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్‌లో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో నిదానంగా ఉన్న విషయం వాస్తవమేనని.. చెప్పింది. ఈ దావా గురించి ఏం జరుగుతుందో పూర్తిగా తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
Also Read: Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Also Read: UAE New Weekend Days: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!
Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు