Mancherial News : మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుర్లకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలోని వీకర్స్ కాలనీలో ఉంటున్న చెన్నల ధనలక్ష్మి (23), అనే మహిళ తన కూతుర్లు సమన్విత (6),  శంకరమ్మ (6నెలల చిన్నారి) లకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు పోలీసులు. పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకుందని, భర్త సాయన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన చెన్నల సాయన్న కుటుంబం బతుకు దెరువు కోసం లక్షేట్టిపేటకు వలసవెళ్లారు. తన భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో భర్త సాయన్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచానామా చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.  ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


లోన్ యాప్ వేధింపులతో యువకుడు సూసైడ్ 


తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఎంతో ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా నంద్యాలలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. లోన్‌ యాప్‌ నిర్వాహకుల టార్చర్ భరించలేక వీరేంద్ర అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాలలోని బాలాజి కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న వీరేంద్ర బెంగళూరులో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అత్యవసరం అయ్యి ఓ యాప్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవ్వడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు స్టార్ట్ చేశారు. వీరేంద్ర అప్పు చెల్లించాలని అతడి బంధువులు, మిత్రులకు యాప్ నుంచి ఫోన్ చేశారు. 


ఫొటో మార్ఫింగ్ చేసి వేధింపులు 


వీరేంద్ర ఫొటోను మార్ఫింగ్ చేసి ఈ వ్యక్తి మా సంస్థలో లోన్‌ తీసుకొని చెల్లించలేదని ఓ మెసేజ్ జోడించి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే అతడి మిత్రులకు, బంధువులకు మార్ఫింగ్ ఫొటో పెట్టారు. వీరేంద్ర మీ నెంబర్‌ను రిఫరెన్స్‌గా ఇచ్చాడు. అతడు  లోన్ చెల్లించలేదు ఇప్పుడు మీరు లోన్‌ను తిరిగి చెల్లించాలి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తాం అని మెసేజ్‌లో రాసుకొచ్చారు.  దీంతో అవమానంగా భావించిన వీరేంద్ర శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్‌ వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Also Read : Prakasam News : ప్రాణం మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం, ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ


 Also Read : Crime News: తాగిన మైకంలో డెలివరీ బాయ్‌ను ఘోరంగా కొట్టిన యువకులు