కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీ (CUET PG 2022) ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. సీయూఈటీ యూజీ 2022 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో నింపిన జవాబుప్రతిని కూడా వెబ్‌సైట్‌లో ఎన్టీఏ అందుబాటులో ఉంచింది. దీని ఆధారంగా అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకోవచ్చు. సీయూఈటీ పీజీ అన్సర్ కీని అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి చూసుకోవచ్చు. అభ్యంతరాలు తెలపవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబు 18 రాత్రి 11.50 వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపవచ్చు.
CUET PG 2022 Display Question Paper and Answer Key Challenge
ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఆన్సర్ కీ ఇలా చూసుకోండి..
- ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
- అక్కడ హోంపేజీలో 'Latest News'లో కనిపించే 'CUET PG 2022 Display Question Paper and Answer Key Challenge' లింక్ మీద క్లిక్ చేయాలి.
- ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడCUET UG 2022 Answer Key link క్లిక్ చేయండి.
- లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి 'Sign In' అవ్వాలి.
- ఆన్సర్ కీ, మీ ఆన్సర్ రెస్పాన్సెస్ కనిపిస్తాయి. ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.
అభ్యంతరాల నమోదు ఇలా..
ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. ఇందుకుగాను ఒక్కోప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్సర్ కీ లింక్ ద్వారానే అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలుంటే 011- 40759000 ఫోన్ నెంబరు లేదా cuetpg@nta.ac.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
సీయూఈటీ పీజీ (CUET PG) ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరిగింది. దాదాపు 35 లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారితంగా జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 500 నగరాల్లో, విదేశాల్లో 13 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Also Read:
NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించినట్లు ఇంటర్, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..