Mancherial Crime : మంచిర్యాల జిల్లా ఇందారం హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశామని జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు.  ఈ నెల 25న ఇందారం గ్రామానికి చెందిన ముష్కె మహేష్(మృతుడు) తల్లి ముష్కె రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య సమాచారం అందగానే జైపూర్ ఎసీపీ నరేందర్ , శ్రీరాంపూర్ సీఐ రాజు, జైపూర్ ఎస్సై  సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి హత్యకు గల కారణాలు, వివరాలు సేకరించారు. జైపూర్ ఎసీపీ నరేందర్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. నిందితులు మహేష్ ను హత్య చేసిన తర్వాత మంథని వైపు వెళ్లారు. ఇవాళ ఇందారంలోని వారి ఇంటికి వచ్చి బట్టలు, డబ్బులు తీసుకొని ఎవరికి కనపడకుండా వెళదామని ఉదయం 05:30 గంటలకు షెట్పెల్లి ఎక్స్ రోడ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని జైపూర్ ఏసీపీ వెల్లడించారు.


అసలేం జరిగింది? 


 నిందితులు పెద్దపల్లి కనకయ్య(44), సాయి(19). పద్మ( 40),  శృతి(22) , శ్వేత(21) అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఒక కత్తి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  పెద్దపల్లి కనకయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు,  ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు శృతికి 2019లో నజీరుపల్లికి చెందిన ముష్కె మహేష్ తో  పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమించుకున్నారు. 2020 వరకు వారు ప్రేమలో ఉన్నారు. తర్వాత అతని ప్రవర్తన నచ్చక శృతి అతనిని ప్రేమించడం మానేసి, మాట్లాడటం ఆపేసింది. అప్పటి నుంచి మహేష్, శృతి, అతను ప్రేమించుకున్నపుడు చనువుగా దిగిన ఫొటోని ఆమెకు చూపించి.. సామాజిక మాధ్యమాల్లో  పెడతానని బెదిరించేవాడు. ఈ విషయం నిందితుడు కనకయ్యకు తెలిసి మహేష్ ను మందలించాడు. అయినా మహేష్ తన ప్రవర్తనను మార్చుకోలేదు.  గత ఏడాది మహేష్... శృతి న్యూడ్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. తర్వాత మహేష్ పై జైపూర్ పోలీస్ స్టేషన్ లో  శృతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో వచ్చిన శృతి న్యూడ్ వీడియోలు చూసి అవమానంతో శృతి భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ విషయంలో సీసీసీ నస్పూర్ PS లో  కేసు నమోదు అయింది. 


బైక్ పై వెళ్తూ హారన్ కొడుతూ వేధింపులు 


ఆ తర్వాత మహేష్... నిత్యం నిందితుల ఇంటి వైపు  బైక్ పై వెళ్తూ, హారన్ కొడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతుండగా....నిందితుని కొడుకు సాయి మహేష్ ను ఆపి కట్టెతో కొట్టాడు. దీంతో మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్దపల్లి సాయిపై  జైపూర్ పీస్ లో కేసు నమోదు అయింది. అతని వల్ల తన కూతురు జీవితం నాశనం అయిందని, కూతురు భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని,  ప్రతి రోజు మహేష్ కనకయ్య ఇంటిముందుకు వచ్చి బైక్ హారన్ కొడుతూ మానసికంగా వేధించడంతో ఎలాగైనా మహేష్ ను చంపాలని కనకయ్య , భార్య పద్మ , కూతురు శృతి, కొడుకు సాయి భావించారు. మహేష్ ఇంటి ముందు నుంచి వెళ్లేటపుడు అడ్డగించి అతన్ని కత్తితో పొడిచి చంపాలని అనుకున్నారు. అందుకోసం పది రోజుల క్రితం గోదావరిఖని వెళ్లి రాజేష్ సినిమా థియేటర్ కు వద్ద ఒక కత్తి కొనుగోలు చేశారు.  ఈ నెల 25 ఉదయం అందాజా 08:30 గంటలకు మహేష్ వీరి ఇంటి ముందు నుంచి ఇందారం బస్ స్టాండ్ వైపు హారన్ కొట్టుకుంటూ వెళ్లాడు. అతను ఎలాగైనా ఇదే దారిలో వస్తాడని ప్లాన్ ప్రకారం మహేష్ వచ్చేది గమనించి కనకయ్య కొడుకు సాయి బైక్ పై వస్తున్న మహేష్ ను ఆపి కనకయ్య పిలువగా తను వెళ్లి మహేష్ టీ-షర్ట్ పట్టుకుని లాగాడు. మహేష్ పారిపోయే ప్రయత్నం చేయగా, కనకయ్య భార్య, కూతురు శృతి కొడుకు సాయి అందరూ కలిసి మహేష్ పై కత్తితో, సిమెంట్ ఇటుకతో దాటి చేశారు. ఈ దాడిలో మహేష్ అక్కడికి అక్కడే చనిపోయాడు. నిందితులు ఇంట్లో ఉంటే మహేష్ తరుపు బంధువులు దాడి చేస్తారని, పోలీసులు పట్టుకుంటారని భావించి ఇంట్లోంచి పారిపోయారు.