BMW Accident Delhi:
ఢిల్లీలో దారుణం..
ఢిల్లీలో BMW కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఓ వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెస్ట్ ఢిల్లీలోని మోతీబాఘ్‌లో ఈ ఘటన జరిగింది. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ కిరాణా షాప్ నడుపుకునే అజయ్ గుప్తా...షాప్ బంద్ చేసి వస్తుండగా కార్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కార్‌ని ఓ మహిళ నడుపుతోంది. ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ ఓ జనరేటర్‌ని ఢీకొట్టిన కార్..ఆ తరవాత నేరుగా అజయ్ గుప్తాపై దూసుకెళ్లింది. ఆమె ఓ పార్టీకి వెళ్లి వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆమెను అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తమకు యాక్సిడెంట్‌కి సంబంధించిన సమాచారం అందినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి అక్కడ రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమై ఉన్నట్టు చెప్పారు. అయితే...యాక్సిడెంట్ చేసిన ఆ అమ్మాయి అక్కడ కనిపించలేదు. బాధితుడి డెడ్‌బాడీ కూడా అక్కడ లేదు. అయితే...ఆ యువతి బాధితుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. అక్కడి నుంచి ESI హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు వచ్చే సమయానికి ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయాడు. అక్కడే స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.
"ఓ మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కార్ వచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు ఓ పార్టీకి వెళ్లి వస్తూ ఈ యాక్సిడెంట్ చేసింది. ర్యాష్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశాం. "
- పోలీసులు