Man Killed in Maharashtra: మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఇద్దరు మహిళలు సిగరెట్‌ తాగుతుండగా చూసి దారుణంగా హత్యకు గురయ్యాడు. నాగ్‌పూర్‌లోని ఓ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఇద్దరు మహిళలు పాన్‌ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్నారు. అదే సమయానికి రంజిత్ రాథోడ్ అక్కడికి వచ్చాడు. సిగరెట్ కొనుక్కుని తాగుతూ...పక్కనే సిగరెట్ తాగుతున్న మహిళలవైపు తదేకంగా చూశాడు. ఇది గమనించిన వాళ్లు వెంటనే రంజిత్‌తో గొడవకు దిగారు. మాటామాటా పెరిగింది. ఆ మహిళలు సిగరెట్ తాగుతూ పొగను రంజిత్ ముఖంపై ఊదడం మొదలు పెట్టారు. తీవ్ర అసహనానికి గురైన ఆ వ్యక్తి వెంటనే తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ ఇద్దరి మహిళల్లో ఒకరు తన ఫ్రెండ్‌కి కాల్ చేసి పిలిపించింది. ఆ ఫ్రెండ్ వచ్చీ రాగానే రంజిత్‌పై దాడి చేశాడు. కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచి అక్కడి నుంచి పరారయ్యా. ఆ పాన్ షాప్ ఓనర్ ఇది చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే షాప్ మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి రంజిత్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. ఆ ఇద్దరు మహిళలతో పాటు హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.