Maharashtra News: మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల ఓ వృద్ధుడు 45 మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. అయితే ఆమెను విడిచి ఉండలేక.. రోజూ తనతోనే కలిసి ఉండాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోయి సుఖంగా జీవించాలనుకున్నారు. అలా వెళ్లిపోతే తన కుటుంబ సభ్యులు పోలీసుల ద్వారా తనను వెతుకుతారని భావించి.. అందుకోసం ఓ సరికొత్త ప్లాన్ వేశాడు. ఓ వ్యక్తిని చంపి, అది తన మృతదేహమే అని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆపై ప్రేయసితో కలిసి పారిపోయాడు. కానీ రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాకు చెందిన సుభాష్ అలియాస్ కర్బా చబన్ థోర్వ్ అనే 65 ఏళ్ల వృద్ధుడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. తన గుట్టు బయట పడకుండా ఆమెతో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నాడు. ఇందుకోసం 45 ఏళ్ల రవీంద్ర భీమాజీ ఘెనంద్ అనే వ్యక్తిని ఈనెల 16వ తేదీన చంపేశాడు. మొండం నుంచి తలను కూడా వేరు చేశాడు. అపై ఆ మొండానికి తన బట్టలు వేశాడు. మృతదేహాన్ని ఓ బట్టతో చుట్టి తన పొలంలో పడేశాడు. అలా అయితే ఓ మృతదేహం తనదే అని కుటుంబ సభ్యులు నమ్మి, తనకోసం వెతకరని ఈ ప్లాన్ వేశాడు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
చనిపోయిందని సుభాష్ యే అని నమ్మిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా మృతదేహం సుభాష్ దే అనుకొని అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే విచారణ జరుపుతున్న పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. సీసీటీవి పరిశీలించగా.. హంతకుడు సుభాషేనని తేలింది. ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. ఆపై ప్రేయసితో పారిపోయిన సుభాష్ ను వెతికి పట్టుకున్నారు. అరెస్ట్ చేశారు. హత్య గురించి పోలీసులు ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించాడు. ప్రేయసితో పారిపోయేందుకే ఇదంతా చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఇటీవలే సోదరి ప్రియుడిని చంపి కుక్కలు ఆహారంగా వేసిన యువకుడు
ఎవరికైనా తీవ్రంగా కోపం వచ్చినప్పుడు నరిక కాకులకు గద్దలకు వేస్తానని చెప్తారు, కోసి ఉప్పూకారం పెడ్తానంటూ బెదిరిస్తారు. కానీ ఓ బిహార్ కు చెందిన ఓ వ్యక్తి మాట వరసకు అనే ఈ మాటలను నిజం చేశాడు. తన చెల్లి ప్రియుడిపై కోపం పెంచుకున్న అతడు.. నిజంగానే అతడిని నరికి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకు ఆహారంగా వేశాడు. బిహార్ కు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లాడు. కానీ రాత్రి అయిపోతున్నా అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు.. బిట్టు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి అడిగారు. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పడంతో అతడు తరచుగా వెళ్లే ప్రాంతాల్లో గాలించారు. అక్కడ కూడా అతని ఆచూకీ లభించకపోవండతో.. డిసెంబర్ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు రాహుల్ పై అనుమనం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా... రాహుల్ నేరాన్ని అంగీకరించాడు.
అయితే తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడం చూసి తాను తట్టుకోలేకపోయానని, అందుకే అతడిపై కోపం పెంచుకున్నట్లు వివరించారు. డిసెంబర్ 16వ తేదీన పథకం ప్రకారమే బిట్టును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. అక్కడే అతడిని నరికి చంపేసి, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత ఆ శరీర భాగాలను వీధి కుక్కలకు ఆహారంగా పెట్టినట్లు తెలిపాడు. మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు.