Madhya Pradesh Crime:
మధ్యప్రదేశ్‌లో అత్యాచార ఘటన..
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార కేసులో అరెస్ట్ అయ్యి సత్ర్పవర్తన కింద ఏడాది క్రితమే విడుదలైన ఓ వ్యక్తి
మరోసారి అదే దారుణానికి పాల్పడ్డాడు. సత్నా జిల్లాలోని ఓ బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడు రాకేశ్ వర్మ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉంది. మెరుగైన చికిత్స అందించేందుకు రెవా మెడికల్ కాలేజ్‌కి తరలించారు. సిటీ సూపరింటెండెంట్ పోలీస్ (CSP) మహేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించిన వివరాల ప్రకారం...12 ఏళ్ల క్రితం నిందితుడు రాకేశ్ వర్మ ఓ నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఏడేళ్ల జైలు శిక్ష తరవాత సత్ర్పవర్తన కింద ముందుగానే విడుదల చేశారు. ఏడాదిన్నర క్రితమే జైలు నుంచి విడుదలై వచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే దారుణానికి ఒడిగట్టాడు.
"నిందితుడు రాకేశ్ వర్మ బాలికకు ఏవేవో మాయ మాటలు చెప్పి బుజ్జగించాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వేరే చోటకు తీసుకెళ్లాడు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలోనే ఈ విషయం తెలిసింది. బాధితురాలికి ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించాం. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఈ కేసుపై పూర్తి విచారణ కొనసాగుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం"
- మహేంద్ర సింగ్ చౌహాన్, సీఎస్‌పీ