భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. ఈ నేలపై ఎన్నో సంస్కృతులు, ఎన్నో పద్దతులతో విరాజిల్లుతోంది. 29 రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతం వారికి ఒక్కో ఆహారపు అలవాటు ఉంటుంది. కొందరికి బిర్యానీ నచ్చితే, మరికొంత మందికి తందూరి రోటీలు నచ్చుతాయి. కొంత మందికి దోశలు నచ్చితే మరికొంత మందికి థాలీ నచ్చుతుంది. తాజాగా భారత్ లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే 100 ఫుడ్ ఐటెమ్స్ లిస్టును  టేస్టీట్లాస్ విడుదల చేసింది. ఇందులో టాప్ 10లో బిర్యానీ చోటు దక్కించుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టేస్టీట్లాస్ టాప్ 10 ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్ లిస్టును ఓసారి పరిశీలిద్దాం.. 


1. బటర్ గార్లిక్ నాన్


రెస్టారెంట్ల‌లో, హోట‌ళ్లలో ల‌భించే ఆహార‌ ప‌దార్థాల్లో బటర్ గార్లిక్ నాన్ ఒక‌టి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. క్లాసిక్ రెసిపీకి ముక్కలు చేసిన వెల్లుల్లిని జోడిస్తారు. తందూరి రోటిని ఓవెన్‌లో కాల్చిన తర్వాత దానిపై వెన్న లేదంటే నెయ్యిని రాస్తారు. రుచి మరింత పెరుగుతుంది. బటర్ చికెన్ లాంటి కూరలతో దీనిని వడ్డిస్తారు.  


2. నాన్ బ్రెడ్


ఇది ఇండో పర్షియన్ కు చెందిన వంటకం. తెల్లటి పిండి, ఈస్ట్, గుడ్లు, పాలు, ఉప్పు, పంచదారతో తయారు చేస్తారు. దీనిని    ఓవెన్‌లో కాల్చుతారు. దీనిని కూరతో కలిపి తింటారు. 


3. బటర్ చికెన్


దీనినికి ముర్గ్ మఖానీ అని కూడా పిలుస్తారు.  బటర్ చికెన్ 1950లో ఢిల్లీ మోతీ మహల్ రెస్టారెంట్ లో తొలిసారి తయారు చేశారు. టమాటలు, వెన్నతో కలిపి,  చికెన్‌ను ఉడికించి ఈ అద్భుతమైన వంటకాన్ని తయారు చేస్తారు. దీనిని రోటీలతో కలిపి తింటారు.  


4. తందూరి


తందూరి అనేది మైదా పిండితో తమారు చేసే రోటీ. బొగ్గులు లేదంటే చెక్కతో నింపిన మట్టి ఓవెన్ లో ఈ రోటీని కాల్చుతారు. మిడిల్ ఈస్ట్ నుంచి ఈ వంటకం భారత్ లోకి అడుగు పెట్టింది.    


5. టిక్కా


 చికెన్, మటన్, పన్నీర్ తో కలిసి వీటిని తయారు చేస్తారు. బోన్స్ తీసివేసిన మాంసాన్ని పెరుగుతో పాటు  సాంప్రదాయ మసాలా దినుసులతో కలుపుతారు. దీనిని ఇనుప చువ్వకు కుచ్చి మట్టి ఓవెన్‌లో కాల్చుతారు.  


6. ఇండియన్ థాలీ
థాలీ అంటే భోజనంతో పాటు వివిధ రకాల వంటకాలను వడ్డించేందుకు ఉపయోగించే ఓ గుండ్రటి ప్లేట్.  దీనిలో అన్నం, పప్పులు, కూరగాయలు, చట్నీ, పచ్చళ్లు, పాపడ్,  స్వీట్లు, మీరు ఉన్న ప్రాంతాన్ని బట్టి మాంసం ఉంటాయి


7. కోర్మా


ఇది వెజ్, నాన్ వెజ్ పద్దతుల్లో తయారు చేస్తారు. దీనిలో కుంకుమ పువ్వు, పెరుగు, సుగంధ ద్రవ్యాలు, కొత్తిమీర, అల్లం, జీలకర్ర,  మిరపకాయలు, పసుపు, మసాలా దినుసులతో తయారు చేస్తారు. పర్షియన్ నుంచి భారత్ లోకి ఈ వంటకం ప్రవేశించినట్లు భావిస్తారు


8. సమోసా


సమోసా భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతారు. మైదాపిండి, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు లేదంటే మాంసంతో దీనిని తయారు చేస్తారు.


9. విండాలూ


ఇది నార్త్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కూర.  మటన్, ఎద్దు మాంసం, పంది మాంసం, రొయ్యలతో తయారు చేస్తారు.  గోవా, కొంకణ్, బ్రిటన్‌ లో ప్రజాదరణ పొందింది.  


10. దోశ


బ్రేక్ ఫాస్ట్ లో ప్రజలు ఎక్కువగా తినే ఫుడ్ దోశ.  ఈ సాంప్రదాయ సౌత్ ఇండియన్ ఫుడ్ నానబెట్టిన బియ్యం, మినుము పప్పుతో తయారు చేస్తారు. ఒకరోజు పులియబెట్టి మరుసటిరోజు దోశాలు తయారు చేస్తారు బంగాళాదుంప వెజిటబుల్ మిక్స్, సాంబార్, చట్నీలతో కలిపి వడ్డిస్తారు.  


Read Also: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, రోజూ తినిపించండి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial