Woman marries boyfriend corpse :  ప్రేమకు కులం అనేది ప్రధాన విలన్.  తరాల నుంచి ఇదే సాగుతోంది. ఇప్పటికీ మారలేదు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో  ఓ ప్రేమికుడ్ని.. ప్రేమికురాలి బంధువులు దారుణంగా కొట్టి చంపారు. దీంతో ఆ ప్రేమికురాలు.. ఆ మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. 
 
25 ఏళ్ల సక్షం టేట్ అనే యువకుడు  బౌద్ధ సముదాయానికి చెందినవాడు. ఆంచల్ అనే యువతి కుటుంబం హిందూ వర్గానికి చెందినవారు.  ఇద్దరూ ప్రేమలో పడ్డారు .  త్వరలో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేశారు.  ఆంచల్ కుటుంబం కుల భేదాలు చూపి ఈ పెళ్లిని వ్యతిరేకించింది.   నాందేడ్‌లోని జునా గంజ్ ప్రాంతానికి మాట్లాడాలని చెప్పి .. యువకుడ్ని ఆంచల్ కుటుంబ సభ్యులు  పిలిచారు. అక్కడికి చేరుకునిన సక్షంను ఆంచల్ తండ్రి గజనాన్ మామిల్వాడ్, సోదరులు హిమేష్, సాహిల్ మామిల్వాడ్‌లతో పాటు మరో ముగ్గురు దాడి చేశారు. తీవ్రంగా కొట్టి హత్య చేశారు  సక్షం అక్కడిక్కకడే చనిపోయాడు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.     

Continues below advertisement



శుక్రవారం సాయంత్రం సక్షం శవానికి అంత్యక్రియల సన్నాహాలు జరుగుతున్నప్పుడు, ఆంచల్  వారి  ఇంటికి  వచ్చింది. అక్కడే కఠఇన నిర్ణయం తీసుకుంది. మృతదేహాన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడల్ని కావాలని నిర్ణయించింది. వివాహ ఆచారాలు నిర్వహించింది. ఆంచల్ సక్షం శవంపై  పుసుపు, కుంకుమ పూసింది.  సక్షం బంధువులు కూడా సాంప్రదాయక ఆచారాల ప్రకారం తులసి పూసారు.  



తన తండ్రి, సోదరులు.. సక్షంను   క్రూరంగా హత్య చేశారు, కానీ వారు ఓడిపోయారు. నా ప్రియుడు మరణంలో కూడా గెలిచాడని ఆంచల్  భావోద్వేగంగా చెప్పింది.   ఆంచల్ తన కుటుంబానికి వేరై, సక్షం తల్లితోనే ఉండాలని నిర్ణయించుకుంది.  ఆంచల్ తన కుటుంబాన్ని పూర్తిగా తిరస్కరించింది.