Activa and Jupiter Mileage Difference: హోండా యాక్టివా (Honda Activa), టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) భారత మార్కెట్లో బాగా అమ్ముడవుతున్న రెండు ఫేమస్ స్కూటీలు. ఈ రెండు టూవీలర్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యాక్టివా, జూపిటర్ దాదాపు ఒకే ధర పరిధిలోకి వస్తాయి. ఈ రెండు స్కూటర్ల ప్రారంభ ధర దాదాపు రూ. 75,000 ఉంది. ఈ రెండు టూవీలర్స్ ఎనర్జీ, ఫీచర్లు, మైలేజ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Continues below advertisement


హోండా యాక్టివ్ (Honda Activa)


Honda Activa 6 రంగుల వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో ఉంది. Honda కంపెనీ ఈ స్కూటర్ స్టాండర్డ్, DLX, స్మార్ట్ 3 వేరియంట్‌లలో మార్కెట్‌లో ఉంది. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్‌లో హాలోజన్ హెడ్‌లైంప్స్, DLX, స్మార్ట్ మోడల్‌లలో LED హెడ్‌లైంప్స్ ఉన్నాయి. ఈ ద్విచక్ర వాహనం స్మార్ట్ వేరియంట్‌లో మాత్రమే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్ ఇచ్చారు.


Honda Activa స్కూటీ స్టాండర్డ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 74,619, DLX మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,272, స్మార్ట్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 87,944. ఈ స్కూటీలో 4 స్ట్రోక్, SI ఇంజిన్ ఇచ్చారు. హోండా యాక్టివా (Honda Activa) 60 kmpl మైలేజ్ ఇస్తుందని పేర్కొంది.



టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)


TVS Jupiter నాలుగు వేరియంట్‌లు భారత మార్కెట్‌లో ఉన్నాయి - స్పెషల్ ఎడిషన్, స్మార్ట్ Xonnect డిస్క్, స్మార్ట్ Xonnect డ్రమ్ మరియు డ్రమ్ అల్లాయ్. ఈ స్కూటర్ 7 రంగుల ఎంపికలలో వస్తుంది. TVS Jupiter  ఎక్స్-షోరూమ్ ధర రూ. 72,400 నుంచి ప్రారంభమవుతుంది. TVS కంపెనీ ఈ స్కూటర్‌లో సింగిల్-సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ అమర్చారు. ఇది 6,500 rpm వద్ద 5.9 kW శక్తిని, అదే సమయంలో 5,000 rpm వద్ద 9.2 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక లీటర్ పెట్రోల్‌లో 53 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని TVS Jupiter పేర్కొంది.


TVS ఈ స్కూటర్‌లో రెండు హెల్మెట్‌లను ఉంచడానికి తగినంత స్థలం ఉంటుంది. ఈ స్కూటర్ శైలి గురించి చెప్పాలంటే.. ఇందులో టెయిల్ లైట్ బార్ ఇచ్చారు. ఈ ద్విచక్ర వాహనంలో భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపింది. కొంతమంది స్కూటర్ ప్రారంభించే ముందు సైట్ స్టాండ్‌ను తీయడం మర్చిపోతారు. దీని కోసం, ఈ స్కూటర్‌లో సైడ్ స్టాండ్ ఇండికేటర్ సైతం ఇచ్చారు.