Pagers detonation In Lebanon | బీరుట్: లెబనాన్ దేశంలో హిబ్జుల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా పేజర్లు పేల్చివేయడంతో విధ్వంసం జరిగింది. రాజధాని బీరుట్ తో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల వరుసగా పేజర్లు పేలిపోయాయి. ఈ పేలుళ్లలో 8 మంది మృతిచెందగా, కొన్ని వేల మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. లెబనాన్, సిరియాలలో పేజర్ అనే కమ్యూనికేషన్ డివైజ్ లను టెక్నాలజీ వాడి ఒక్కసారిగా పేల్చివేశారు. చేతిలో పట్టే పేజర్లను ఉద్దేశపూర్వకంగా పేల్చివేసి విధ్వంసం సృష్టించాలని చూశారని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. ఈ పేజర్ల పేలుళ్ల ఘటన పశ్చిమాసియాలో కలకలం రేపింది. పేజర్ల పేలుళ్ల ఘటనలో హిజ్బుల్లా ఉగ్రవాదులు, కొందరు పౌరులు కలిపి మొత్తం 8 మంది మృతిచెందగా, 2750కు గాయపడ్డారని అధికారులు మీడియాకు తెలిపారు. లెబనాన్‌లో గాయపడిన వారిలో ఇరాన్ రాయబారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.






మొదట లెబనాన్ లో పలుచోట్ల పేజర్ అనే కమ్యూనికేషన్ డివైజ్‌లు పేలిపోయాయి. అదే తరహాలో ఇరాన్ లో కొన్నిచోట్ల పేజర్లను పేల్చివేసి ప్రజల్ని భయాందోళనకు గురిచేశారు. ఈ పేజర్లు చేతిలో పట్టుకుని, ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుంటుందని.. వాటిని టెక్నాలజీ సాయంతో పేల్చివేశారని లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. ఈ పేలుళ్లలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను వైద్యశాఖ్ మంత్రి ఆదేశించారు. 


 






Also Read: Cyber Crime: సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు - సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెదిరించి లోన్ తీసుకున్నారు, ఎక్కడంటే?