Coffee and Tea Stain Removal Hacks : డ్రెస్​పై పడిన టీ లేదా కాఫీ మరకలు వదలట్లేదా? ఈ సింపుల్ టిప్స్​తో వదిలించేయండిలా

Instant stain removal solutions : దుస్తులపై పడిన టీ లేదా కాఫీ మరకలు అంత సులువుగా వదలవు. అయితే కొన్ని సింపుల్ టిప్స్​తో ఈ మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..

Continues below advertisement

Quick and Easy Stain Removal Methods : ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్​పై టీ లేదా కాఫీ మరకలు పడితే వెంటనే వాటిని మార్చి వాష్ చేయడం చేస్తూ ఉంటాము. అదే మరి బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి మరకలు పడితే మార్చుకునే వీలు ఉండదు. పైగా ఈ మరకలు ఎక్కువ సేపు ఉంటే మొండి మరకల్లా తయారవుతాయి. అప్పుడు వాటిని శుభ్రం చేయడం చాలా కష్టమవుతుంది. ఈ సమస్యను మీరు కూడా ఫేస్ చేస్తే కొన్ని సింపుల్ హ్యాక్స్​ని ఫాలో అవ్వొచ్చు. 

Continues below advertisement

అనుకోకుండా దుస్తులపై టీ లేదా కాఫీ మరకలు పడడం కామన్. అయితే అసలు సమస్య ఎప్పుడంటే ఆఫీస్​లో లేదా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్న సమయంలో ఇలాంటి మరకలు పడితే ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సింపుల్ హ్యాక్స్ ఫాలో అవ్వడం వల్ల మరకను తొలగించవచ్చు. ఆఫీస్​లో ఉన్నప్పుడు టీ లేదా కాఫీ మరకలు పడితే.. సులభంగా వాటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

బ్లీచ్​తో.. 

ఆఫీస్​కి ఒక్కొక్కరు ఒక్కోరకమైన డ్రెస్​ వేసుకెళ్తారు. వాటిలో వివిధ రకాలు ఉంటాయి. అయితే మీరు లెనిన్ వంటి దుస్తులపై కాపీ లేదా టీ పడితే.. బ్లీచ్ సహాయంతో దానిని శుభ్రం చేసుకోవచ్చు. కొంచెం బ్లీచ్ తీసుకుని.. దానిని టిష్యూ పేపర్ మధ్యలో ఉంచి.. కాస్త తడి చేసి మరకపడిన చోట అప్లై చేయాలి. సున్నితంగా రుద్దుతూ శుభ్రం చేయాలి. బ్లీచ్ ఎక్కువ వాడితే డ్రెస్ కరాబ్ అవుతుంది. కాబట్టి తక్కువ మొత్తంలో దానిని తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇది మరకలను సులభంగా తొలగించడంలో సహాయం చేస్తుంది. 

పౌడర్.. 

కాఫీ లేదా టీ మరకలను ముందుగా టిష్యూ సహాయంతో క్లీన్ చేయాలి. టిష్యూని తడిపి దానిని మరకపై అప్లై చేయాలి. మరక పూర్తిగా పోదు. దాని తాలుఖా మచ్చలు ఉంటాయి. వాటిని వదిలించుకునేందుకు పౌడర్​ను అప్లై చేయాలి. తడిగా ఉండే ఆ ప్రదేశంలో పౌడర్ అప్లై చేయడం వల్ల ఈ మరక కనిపించదు. 

కోల్డ్ వాటర్..

దుస్తులపై ఉన్న మరకలను శుభ్రం చేయడానికి కోల్డ్ వాటర్ ఉపయోగించుకోవచ్చు. డ్రెస్​లను పూర్తిగా తడిపే ఆప్షన్ లేనప్పుడు.. కోల్డ్ వాటర్​లో టిష్యూ పేపర్​ను ముంచి... దానిని మరక పడిన ప్రదేశంలో రబ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మరకపోతుంది. 

వెనిగర్.. 

ఆఫీస్ క్యాంటీన్​లలో వెనిగర్ దొరుకుతుంది. దీనితో కూడా టీ, కాఫీ మరకలను వెంటనే వదిలించుకోవచ్చు. వెనిగర్​ను టిష్యూలో వేసుకుని.. మరకపై అప్లై చేయడం వల్ల మరక వదిలిపోతుంది. పెద్ద మరకలను ఇంట్లో వదిలించుకునేందుకు కూడా వెనిగర్​ను ఉపయోగిస్తాము. వెనిగర్​ను నీటిలో వేసి.. మరకలున్న డ్రెస్​లను దానిలో నానబెట్టాలి. రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే వాష్ చేస్తే మరక వదిలిపోతుంది. 

ఈ హ్యాక్స్ కచ్చితంగా ఏదొక సమయంలో అవసరం పడుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మరక త్వరగా వదిలిపోతుంది. ఎక్కువసేపు డ్రై అయితే మరకలు వదిలించడం కష్టమవుతుంది కాబట్టి.. ఈ సింపుల్ హ్యాక్స్ మీరు ఫాలో అవ్వండి.. మీ కొలిగ్స్​తో కూడా షేర్ చేసుకోండి. 

Also Read : రాత్రుళ్లు ఆ పనులు చేస్తే సైలెంట్ హార్ట్ ఎటాక్స్ తప్పవట.. ఆ మిస్టేక్స్ అస్సలు చేయొద్దంటోన్న నిపుణులు

Continues below advertisement