Khammam News: భవిష్యత్తు పౌరులను సన్మార్గులుగా తయారు చేసే భాద్యత గల ఉపాధ్యాయుడు కీచకుడిలా మారాడు. తన తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గౌరవ ప్రదమైన వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. నేరగాళ్లు వ్యవహరించే తీరులా పక్కా ప్లాన్‌తో వ్యవహరించి తన తోటి ఉపాధ్యాయురాలిపై మరో ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


ఖమ్మంలో నివాసముంటున్న బానోత్‌ కిషోర్‌ అనే ఉపాధ్యాయుడు మహాబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో పని చేస్తున్నాడు. ఇతని భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఈమె కూడా డోర్నకల్‌ సమీపంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. భార్య భర్తలు ఇద్దరూ రోజూ కారులో పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఖమ్మంలో నివసించే మరో ఉపాధ్యాయురాలు డోర్నకల్‌ మండలంలో టీచర్‌గా పనిచేస్తుంది. ఈమె ప్రతిరోజు డోర్నకల్‌ వరకు రైలులో వెళ్లి అక్కడ్నుంచి తన ద్విచక్రవాహనంపై పాఠశాలకు హాజరవుతుంటుంది.


ఎప్పట్నుంచో కన్నేసిన కీచక టీచర్‌..
డోర్నకల్‌లో పనిచేసే ఉపాధ్యాయురాలిపై ఎప్పట్నుంచో కన్నేసిన కీచక టీచర్‌ ఆమెను అనుభవించాలని కోరికను పెంచుకున్నాడు. అదను కోసం వేచి చూశాడు. ఇటీవల పాఠశాలకు ఒక పూట బడులు ప్రారంభం కావడం, ఓ రోజు తన భార్య పాఠశాలకు రాకపోవడంతో ఎలాగైనా డోర్నకల్‌లో పనిచేసే టీచర్‌ను అనుభవించాలని నిశ్చయించుకున్నాడు. పాఠశాల విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న టీచర్‌ వద్దకు వెళ్లాడు. తన భార్య కూడా ఉందని ముగ్గురం కలిసి ఖమ్మంకు కారులో వెళదామని నమ్మించాడు. అతని మాయమాటలకు నమ్మిన టీచర్‌ కీచకుడి భార్య కూడా ఉందని నమ్మి కారు ఎక్కింది. ఇదే అదనుగా భావించిన కీచక టీచర్‌ ఖమ్మం పాండురంగాపురంలోని ఓ ఇంటికి బాధితురాలిని తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.


అత్యాచారం బయటకు రాకుండా ఉండేందుకు బెదిరింపులు..
పాండురంగాపురంలోని ఓ ఇంటికి ఉపాధ్యాయురాలిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కీచక టీచర్‌ ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని బావించి ఉపాధ్యాయురాలిని బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే కుటుంబంతో సహ అందరిని అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడాడు. తన భర్తను, పిల్లలను హతమారుస్తాడని బెదిరించాడు. దీంతో బయపడిన బాదితురాలు కొన్ని రోజుల పాటు ఇంటికి వెళ్లి మదన పడసాగింది. అయితే కొద్దిగా దైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది. దీంతో ఇద్దరు కలిసి ఖమ్మం అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. బాదితురాలి పిర్యాదు మేరకు ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.