Karnataka Crime News: ఆడైనా, మగైనా, చిన్న పిల్లలైనా, పండు ముసలివాళ్లైనా అయినా సరే... కొందరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. కొందరైతై పుశువుల్లా ప్రవర్తిస్తూ పశువులైనా సరే కామ వాంఛ తీర్చుకుంటున్నారు. బతికున్న వాటితోనే కాదండోయ్.. మనుషులు, పశువుల శవాలనూ వదలడం లేదు. ముఖ్యంగా మేకలు, కుక్కలు, గుర్రాలు వంటి జంతువులపై అఘాయిత్యం జరిగిన ఘటనలపై కేసులు నమోదు అవుతున్నాయి. జంతువులపై గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా ఓ వ్యక్తి మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేనా ఈ తతంగాన్ని వీడియో తీసుకొని ఇష్టం వచ్చినప్పుడల్లా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అయితే ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ వ్యక్తి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. 


అసలేం జరిగిందంటే..?


కర్ణాటకలోని రామనగర జిల్లా చన్నపట్నంలోని ఇందిరా కాటేజీలో రోహిత్ అనే వ్యక్తి మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మేక అరుపులు వినిపించడం, అప్పటికే రోహిత్ తీరు అనుమానంగా ఉండడంతో జమీర్ ఖాన్ వ్యక్తి అతడిని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలోనే ఆ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణాన్ని చూసిన జమీర్ ఖాన్ చన్నపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో రోహిత్‌పై కేసు పెట్టాడు. సెప్టెంబర్ 1వ తేదీన తాను రోహిత్‌ను వెంబడిస్తుండగా... ఈ దారుణాన్ని చూశానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ రోజు 12 గంటల నుంచి 1 గంట వరకు రోహిత్ అత్యాచారానికి పాల్పడ్డాడని, మేకపై అత్యాచారం చేస్తూనే వీడియో తీసుకున్నట్లు వివరించాడు. ఈక్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


గతేడాది గర్భంతో ఉన్న మేకపై గ్యాంగ్ రేప్


గతేడాది కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కాసరగోడ్ జిల్లా కనహాగడ్​లో నాలుగు నెలల గర్భంతో ఉన్న మేకను ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు.ఆ తర్వాత ఆ మేకను చంపేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. పోలీసులను నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉండే మొయిదీన్ కుంజూ అనే వ్యక్తికి అదే ప్రాంతంలో రెస్టారెంట్ ఉంది. కార్మిక సంఘాల సమ్మెకు పిలుపునివ్వగా.. ఆయన రెస్టారెంట్ ను మూసేశారు. అదే సమయంలో రెస్టారెంట్ వెనుక భాగంలో మేకను కట్టేశాడు. అయితే అదే రోజు రాత్రి కుంజూకు మేక అరుస్తున్న శబ్దం వినిపించింది. ఏమైందో ఓసారి చూద్దామనుకుని వెళ్లగా.. ముగ్గురు వ్యక్తులు మేకపై అత్యాచారానికి పాల్పడడం చూశాడు. అక్కడే ఉన్న ఓ రెస్టారెంట్ లో పని చేసే సెంథిల్ తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు కనిపించారు. దీంతో కుంజూ గట్టిగా అరిచాడు. అది చూసిన నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ స్థానికుల సాయంతో కుంజూ.. సెంథిల్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. నాలుగు నెలల గర్భంతో ఉన్న తన మేకపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలిపాడు. మరో ఇద్దరు తప్పించుకున్నారని వివరించాడు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో ట్రై చేశారు.