కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మనవరాలు సౌందర్య (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

  






బెంగళూరులోని హైగ్రౌండ్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో సౌందర్య ఉరి వేసుకున్నట్లు సమాచారం. పోస్ట్​మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బౌరింగ్​ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటి లభించలేదని స్పష్టం చేశారు.







యడియూరప్ప కుమార్తె అయిన పద్మావతి కూతురు సౌందర్య. ఆమె కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా డిప్రెషన్​లో ఉన్నట్లు సమాచారం. డాక్టర్​ అయిన సౌందర్య 2018లో డా. నీరజ్​ను వివాహం చేసుకుంది. వీరికి ఆరు నెలల పాప కూడా ఉంది.


దర్యాప్తు మొదలు..






ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద కేసుగానే నమోదు చేసినట్లు తెలిపారు.


Also Read: Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!