Karnataka Crime News: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్ కోసం ఓ వ్యక్తి డెలవరీ బాయ్ నే హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని నాలుగు రోజులు బాత్ రూంలో దాచి పెట్టాడు. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపింది. ఫిబ్రవరి 7వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్త అనే వ్యక్తి ఐఫోన్ కోసం అదిరిపోయే ప్లాన్ వేశాడు. తన దగ్గర ఫోన్ కొనేందుకు డబ్బులు లేకపోయినా ఆన్ లైన్ లో 46 వేల రూపాయల విలువ చేసే ఐఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెట్టాడు. ఫిబ్రవరి 7వ తేదీన ఇ-కార్ట్ ఎక్స్ ప్రెస్ (ఫ్లిప్ కార్ట్ అనుబంధ సంస్థ)లోని డెలివరీ బాయ్.. ఐఫోన్ ను డెలివరీ చేసేందుకు వచ్చాడు. డబ్బులు ఇవ్వక ముందే సెల్ ఫోన్ డబ్బాను తెరిచి చూపించాలని హేమంత్ కోరగా.. డబ్బులు ఇస్తేనే ఫోన్ డెలివరీ చేస్తానని ఆ బాయ్ తేల్చి చెప్పాడు. దీంతో ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని.. కాసేపు ఇంట్లో కూర్చుంటే డబ్బులు తీసుకువస్తానని డెలవిరీ బాయ్ ను నమ్మించాడు. మాయ మాటలు చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ఆపై కత్తితో డెలివరీ బాయ్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు డెలివరీ బాయ్ అక్కడికక్కడే ప్రమామాలు కోల్పోయాడు.
విషయం గుర్తించిన హేమంత్.. మృతదేహాన్ని దాచి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే డెలివరీ బాయ్ శవాన్ని ఇంట్లోని బాత్రూంలో దాచి పెట్టాడు. ఆపై దుర్వాసన వస్తుండడంతో గోనె సంచిలో దాని బైక్ పై సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లాు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పంటించాడు. అయితే నాలుగు రోజులుగా డెలివరీ బాయ్ కనిపించకోపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడు హేమంత్ ను పట్టుకున్నారు. గట్టిగా విచారించగా.. అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఐఫోన్ కోసమే డెలివరీ బాయ్ ను హత్య చేశానని... మృతదేహాన్ని పెట్రోల్ పోసి అంటిచినట్లు వివరించాడు. అయతే హేమంత్ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించినట్లు పోలీసులు వివరించారు.