Karimnagar Crime : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం  గన్ముక్కుల గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పిల్లల తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అతడి భార్య పోలీసులకు ఫోన్ చేయడంతో వీణవంక పోలీసులు వెంటనే స్పందించారు. పోలీసుల రాకను గమనించిన అతడు పిల్లల్ని వదిలేసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  


అసలేం జరిగింది?  


పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం గన్ముక్కుల గ్రామానికి చెందిన వీణవంక కుమార స్వామి, జ్యోతిలక్ష్మికి ఇద్దరు( శ్రీనాథ్,  శ్రీనిథ్) పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన కుమార స్వామి రోజు ఇంట్లో గొడవ పడేవాడు. శనివారం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్యను కొట్టి, పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు డయల్ 100కు  ఫోన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.


బావిలో దూకి ఆత్మహత్య 


పిల్లలను తీసుకొని వెళ్తోన్న కుమారస్వామిని పోలీసులు వెంబడించారు. పోలీసులను చూసిన కుమార స్వామి పిల్లలను వదిలేసి దగ్గరున్న వ్యవసాయ బావిలో దూసేశాడు. బావిలో దూకిన కుమార్ స్వామిని కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు. వీణవంక ఎస్సై శేఖర్ రెడ్డి, బ్లూ కోర్ట్స్ సిబ్బంది తిరుపతి ప్రకాష్, హోంగార్డ్ ప్రకాష్ బావిలో దిగి కుమార స్వామిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అతని ఆచూకీ దొరకలేదు. చనిపోయిన తర్వాత అతడి శవం పైకి తేలింది. గ్రామస్తుల సహాయంతో కుమార స్వామి మృతదేహాన్ని బయటకి తీశారు. పోలీసులు రాకపోతే కుమార్ స్వామి ఇద్దరు పిల్లలు చంపేవాడని పోలీసులు సకాలంలో వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులు. కుమార స్వామి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వీణవంక పోలీసులు తెలిపారు. 


భార్యను కడతేర్చిన భర్త


హైదారాబాద్ లోని కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పచ్చగా ఉన్న కాపురంలో అనమానమనే మంట పడి చిచ్చు రేగింది. చివరకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఆ భర్త. ఆపేందుకు వచ్చిన ఓ మహిళపై కూడా కత్తి దూశాడు. చేసిన నేరానికి గాను అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్లు కూడా నిండని తమ కూతుర్ని తమకు దూరం చేశాడంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


అసలేమైందంటే...?


కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ జియాగూడలో సంతోష్, సరిత దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ టిఫిన్ సెంటర్ లో పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. అయితే సంతోష్, సరితలకు పెళ్లి జరిగి పట్టుమని పదేళ్లు కూడా కావట్లేదు. ఇన్నాళ్లూ బాగానే ఉన్న సంతోష్.. గత కొంత కాలంగా భార్య సరితను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. అయితే ప్రతీ రోజూ వెళ్లినట్లుగానే ఈరోజు కూడా పని నిమిత్తం టిఫిన్ సెంటర్ కు వెళ్లాడు. భర్త వెళ్లిపోయిన తర్వాత సరిత ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటోంది. భర్త సంతోషన్ సడెన్ గా ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. ఆ సమయంలో సరిత బంధువు కూడా ఇంట్లోనే ఉంది.  భార్యాభర్తల మధ్య గొడవ ముదిరే సరికి గొడవ పడొద్దంటూ చెప్పింది. అంతలోనే సంతోష్ తన వద్ద ఉన్న కత్తి తీసి భార్య ప్రైవేట్ పార్ట్ లో పొడిచాడు. ఆపేందుకు సరిత బంధువు వెళ్తే... ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో సరితకు తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే చనిపోయింది.