Kanjhawala Case:
శరీరంపై 40 గాయాలు..
ఢిల్లీలోని కంజావాలా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి మృతిపై కుటుంబ సభ్యులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా నిందితులు చెప్పిన సమాధానాలనూ వెల్లడించారు. అసలు ఆ యువతి తమ కార్‌కు చిక్కుకుని ఉందన్న సంగతే గుర్తించలేదని అంటున్నారు నిందితులు. ఇందులో నిజానిజాలు ఇంకా తేలకపోయినా...ఈ కేసు మాత్రం దేశ రాజధానిలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఇటీవలే యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు పోలీసులు. దీని ప్రకారం...ఆ యువతి అత్యంత దారుణంగా చనిపోయింది. తల చీలిపోయి...ఎముకలన్నీ విరిగిపోయాయని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. పక్కటెముకలు చీల్చుకుని బయటకు వచ్చేశాయని వైద్యులు వివరించారు. మౌలానా ఆజాద్ కాలేజ్‌కు చెందిన
ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ యువతి డెడ్‌బాడీని పరిశీలించి...ఈ రిపోర్ట్‌ను వెలువరించింది. తల, వెన్నెముకతో పాటు ఊపిరి తిత్తులకూ బలమైన గాయాలైన కారణంగానే మృతి చెందినట్టు నిర్ధరించారు వైద్యులు. యాక్సిడెంట్ కారణంగా షాక్‌కు గురైందని, ఆ తరవాత తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఒంటిపైన మొత్తం 40 గాయాలైనట్టు గుర్తించారు. కార్ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల తలకు బలమైన గాయమైనట్టు చెప్పారు. అందులోనూ..దాదాపు 10 కిలోమీటర్లకు పైగా లాక్కుని వెళ్లడం వల్ల శరీరానికి గాయాలయ్యాయి. మెదడులో కొంత భాగం కనిపించకుండా పోయిందని షాకింగ్ విషయం చెప్పారు వైద్యులు. అయితే...మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విధంగా లైంగికంగా వేధించారనడానికి శరీరంపై ఎలాంటి గుర్తులు లేవని వెల్లడించారు.
స్కూటీపై ఇద్దరు..!
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన కంఝవాలా కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. న్యూ ఇయర్ రాత్రి కారు ఢీకొని 12 కిలోమీటర్లు రహదారిపై ఈడ్చుకెళ్లిన యువతి ప్రమాద సమయంలో ఒంటరిగా లేదని తేలింది. ఆ యువతితోపాటు స్కూటీపై స్నేహితురాలు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. పోలీసులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితురాలితోపాటు
కూర్చొన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్టు గుర్తించారు. బాధితురాలు, ఆమె స్నేహితురాలు రాత్రి సమయంలో స్కూటీపై వెళుతున్నట్లు సిసిటివి ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఫుటేజ్‌లో బాధిత యువతి పింక్ టీ షర్టులో ఉండగా, ఆమె స్నేహితురాలు ఎరుపు టీ షర్టులో ఉన్నారు. బాధితురాలి స్నేహితురాలు స్కూటీ నడుపుతుండగా, ఆమె వెనుక కూర్చున్నారు. మధ్యలో ఓ చోట తాను నడుపుతానంటూ బాధిత యువతి. వద్దని స్నేహితురాలు వారిస్తూ... మాట్లాడుకుంటూ ఇద్దరూ వెళ్లారు. కాస్త దూరం వెళ్లాక... స్కూటీని బాధిత యువతికి ఇచ్చేసింది స్నేహితురాలు. అక్కడ నుంచి ఆమె స్కూటీని నడుపుకొని కొంత దూరం వెళ్లింది. స్నేహితురాలు వెనుక కూర్చొని ఉంది. ఇలా వెళ్తున్న క్రమంలోనే సుల్తాన్ పురి ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: 2.5 నిమిషాల్లో 2757 కండోమ్స్ డెలివరి- ఎవరూ తగ్గలేదు!