Kamareddy Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మద్నూర్ మండలం మెనూర్ గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ఆటో ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. లారీ కింద నుంచి ఆటోను తీసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై నుంచి ఆటోను లారీ ఈడ్చుకుంటూ రోడ్డు పక్కకు వచ్చింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది.
రాంగ్ రూట్ ప్రయాణం వల్లే
స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తోంది. ఆటో మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వస్తుంది. అదుపుతప్పిన ఆటో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు అయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఘటనాస్థలంలో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై 44 రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై అయిదు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను బాల్కొండ మీదుగా మళ్లిస్తున్నారు.
నదిలో పడిపోయిన బస్సు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఇందోర్ నుంచి పుణె వెళ్తున్న ఓ బస్సు వంతెన మీద నుంచి నర్మదా నదిలో పడింది. ధార్ జిల్లా ఖాల్ ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు తెలిపారు. మరో 15 మంది రక్షించారు. అయితే మరో 23 మంది కోసం గాలింపు చేపట్టినట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
Also Read : Nizamabad News : వానొచ్చెనంటే వరదొస్తది, ఆ కాలేజీ బంద్ అయితది!
Also Read : Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో దారుణం, రెండేళ్లుగా బాలికపై యువకుడు లైంగిక దాడి!