Kakinada Youth Killed in Samarlakota in Kakinada District: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పట్ట పగలే ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. అది కూడా పుట్టినరోజు నాడు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.  నిందితుడు ఓ యువకుడ్ని వేట కత్తితో నరికి హత్య చేశాడు. ఈ విషాదం కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కేసు నమోదు చేసిన సామర్లకోట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితుడు పీఎస్‌లో లొంగిపోయి తానే శివను హత్య చేసినట్లు అంగీకరించాడు.


పుట్టినరోజు నాడే పట్ట పగలే దారుణం.. 
సామర్లకోటకు చెందిన యువకుడు శివ పుట్టినరోజు నేడు. బర్త్ డే సందర్భంగా శివ మూవీ చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. కొందరు గుర్తుతెలియని దుండగులు శివపై ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కత్తితో నరకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శివ. కొంతసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శివను హత్య చేసిన నిందితుడ్ని మణి అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.


అసలేం జరిగిందంటే..
తలాటుర్ శివ అనే యువకుడు సామర్లకోటలోని అమ్మమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నేడు తన పుట్టినరోజు కావడంతో సినిమా చూసేందుకు స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌కు వెళ్లాడు. శివను హత్య చేసేందుకు ముందుగానే ప్లాన్ వేసుకున్న నిందితుడు అతడ్ని ఫాలో అయ్యాడు. షర్టులో వేట కత్తిని పెట్టుకుని మణి థియేటర్ వద్దకు వెళ్లాడు. అతడితో పాటు మరికొందరు యువకులు ఒక్కసారిగా శివపై రాడ్లు, వేట కత్తితో దాడి చేశారు. మణి, అతడి స్నేహితులు జరిపిన దాడిలో శివ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే కొంతసేపటికే శివ ప్రాణాలు వదిలాడని స్థానికులు చెబుతున్నారు.


హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడు మణి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వివాదం ఉందని గుర్తించారు. ఆ మహిళ కేవలం తనకు మాత్రమే దక్కాలని భావించిన నిందితుడు మణి.. శివపై కక్ష పెంచుకున్నాడు. పుట్టినరోజు నాడే హతమార్చాలని భావించిన మణి తన ప్లాన్ ప్రకారం వేట కత్తితో వెళ్లి దాడిచేసి శివను దారుణంగా హత్యచేశాడు.


Also Read: Repalle Rape Case: రేపల్లెలో అత్యాచార కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు, టైమ్ అడిగి గొడవ, ఆపై మహిళపై అఘాయిత్యం


Also Read: Repalle Woman Incident: మహిళలపై వరుస అఘాయిత్యాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్, బాధితులను పరామర్శించిన మంత్రి మేరుగు నాగార్జున