Mla Jeevan Reddy : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు అందిందని వెస్ట్ జోన్ డీసీపీ జ్యోయల్ డెవిస్ తెలిపారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తి ఎయిర్ పిస్టల్, డ్రాగర్ తో  హత్యాయత్నం చేశాడని తెలిపారు. ఎమ్మెల్యే కేకలు వేయడంతో పారిపోయాడని తెలిపారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని జ్యోయల్ డెవిస్ స్పష్టం చేశారు. 


ఎంపీవోపై దాడి 


ఎయిర్ రైఫిల్, పిల్లెట్స్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.  తన భార్య సర్పంచ్ గా పని చేస్తున్న సమయంలో రూ.20 లక్షల పనులు చేశారని, అందులో అవకతవకలు జరిగాయని ఎంపీవో నివేదిక ఆధారంగా సర్పంచ్ ను అధికారులు సస్పెండ్ చేశారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన డబ్బులు రాలేదని సర్పంచ్ భర్త ప్రసాద్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎంపీవోపై నిందితుడు దాడి కూడా చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. 


సర్పంచ్ సస్పెన్షన్ వెనక ఎమ్మెల్యే 


తన భార్య సస్పెన్షన్ అవ్వడం వెనకాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హస్తముందని భావించిన అతనిపై కక్ష పెంచుకున్నాడు నిందితుడు ప్రసాద్. ఏప్రిల్ 28న కంట్రీ మేడ్ తుపాకీని నాందేడ్ వద్ద కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. సంతోష్ అనే వ్యక్తి సహాయంతో ఎయిర్ పిస్టల్, పిల్లట్స్  కొనుగోలు చేశాడన్నారు. జులై మొదటి వారంలో పరిచయమైన సుగుణ, సురేందర్ ల సహాయంతో కంట్రీమేడ్ తుపాకీని రూ.60 వేలకు కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. 


కంట్రీ మేడ్ తుపాకీతో 


'మున్నాకుమార్ అనే వ్యక్తికి నిందితుడు నగదు బదిలీ చేశాడు. సురేందర్, ప్రసాద్ కు కంట్రీ మేడ్ తుపాకీని నిందితుడికి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ బుల్లెట్లు మాత్రం ఇవ్వలేదు. నాందేడ్ కు వస్తే ఇస్తానని చెప్పాడు మున్నా కుమార్. అక్కడికి వెళ్లినా అతనికి బుల్లెట్స్ అందలేదు. దీంతో తిరిగి వచ్చేశాడు. ఈ హత్యాయత్నంలో సుగుణ, సురేందర్, మున్నా కుమార్, సంతోష్ ల పాత్ర ఉంది. వారినీ త్వరలో పట్టుకుంటాం. ప్రసాద్ పై ఆరు కేసులు నమోదు అయ్యాయి. ప్రసాద్ ను కస్టడీలోకి తీసుకుంటాం. జీవన్ రెడ్డి ఇంట్లోని మూడో అంతస్తులో ఎమ్మెల్యేపై దాడికి యత్నించాడు నిందితుడు' -  వెస్ట్ జోన్ డీసీపీ జ్యోయల్ డెవిస్


అసలేం జరిగింది? 


ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ జీవన్‌ రెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఓ సర్పంచ్ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఆర్మూర్‌ లో మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్తగా పోలీసులు గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్‌ పదవి నుంచి ఎమ్మెల్యే సస్పెండ్‌ చేయించారని, ఆ అక్కసుతోనే ఆమె భర్త ప్రసాద్‌ గౌడ్‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకుని ఆయన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.


Also Read : Jeevan Reddy Case : పక్కాగా రెక్కీ చేసి సింపుల్‌గా దొరికిపోయాడు - ఎమ్మెల్యే హత్యకు కుట్ర కేసులో కీలక అంశాలు !


Also Read : MLA Jeevan Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం! కత్తి, తుపాకీతో వచ్చిన సర్పంచ్ భర్త