Mine Collapsed:
ఝార్ఖండ్‌లో ఘటన..
ఝార్ఖండ్‌లో బొగ్గు గనిలో అక్రమంగా మైనింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కూలిపోవడం వల్ల ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎంత మంది ఉన్నారన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ధన్‌బాడ్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL)లో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయమే ప్రమాదం జరగ్గా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 3గా తేల్చిన అధికారులు...రెస్క్యూ ఆపరేషన్ పూర్తైన తరవాతే ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు చెప్పగలమని వెల్లడించారు. చాలా మంది ఇక్కడ అక్రమంగా మైనింగ్‌కి పాల్పడుతున్నట్టు స్థానికులు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురుని బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించే లోపే వాళ్లు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మృతి చెందిన ముగ్గురిలో ఓ మహిళతో పాటు ఓ బాలిక కూడా ఉంది. గాయపడ్డ వారిని స్థానిక నర్సింగ్ హోమ్‌కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ మెషీన్‌లు తీసుకొచ్చి ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. స్థానికులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో తమ వంతు సాయం చేస్తున్నారు. కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బొగ్గుని కట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అది మీద పడిందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 15 మంది ప్రమాద సమయంలో అక్కడే ఉన్నట్టు అంచనా.