WTC Final 2023:
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కొత్త వాదనకు తెరతీశాడు! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో మైండ్‌గేమ్ ఆడుతున్నాడు! బీసీసీఐ విరాట్ కోహ్లీకి అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నాడు. అతడిపై గౌరవంతో కనీసం వన్డే కెప్టెన్‌గా అయినా కొనసాగించాల్సిందని అంటున్నాడు. అతడిలో తనకు నచ్చనిది ఏమీ లేదని పేర్కొన్నాడు.
ఫైనల్లో టీమ్‌ఇండియా ఆటతీరు బాగాలేదని, రవిచంద్రన్ అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదని మిగతా వాళ్లు విమర్శిస్తుంటే జస్టిన్ లాంగర్ మాత్రం మరో దారి ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వ హయాంలో బీసీసీఐ వ్యవహార శైలి బాగాలేదని విమర్శిస్తున్నాడు.
'విరాట్ కోహ్లీ దూకుడంటే నాకెంతో ఇష్టం. బీసీసీఐ అతడికి అన్యాయం చేసింది. నేను ఇంకేమీ వినదల్చుకోలేదు. వన్డే కెప్టెన్సీ కావాలని నిజంగానే అతడు కోరుకుంటే బీసీసీఐ అందుకు అనుమతి ఇవ్వాల్సింది. అసలు విరాట్ కోహ్లీలో నేను ఇష్టపడనిది ఏదీ లేదు. అతడి దూకుడు, అభిరుచి, బ్యాటింగ్ సహా అన్నీ ఇష్టం. అతడో అద్భుతమైన కెప్టెన్' అని లాంగర్ అన్నాడు.
టీమ్‌ఇండియా 2018-19 సీజన్లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీసు గెలిచింది. అప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కాగా ఆస్ట్రేలియాకు జస్టిన్ లాంగర్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పటి వరకు చాలాసార్లు విరాట్ కోహ్లీని అతడు తెగపొగిడేశాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే (29 బ్యాటింగ్: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కేఎస్ భరత్ (5 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇంకా 318 పరుగులు వెనకబడి ఉంది. కనీసం ఫాలో అప్ తప్పించుకోవాలన్నా 119 పరుగులు చేయాలి.
ఆసీస్ తొలి ఇన్నింగ్సులో ఆసీస్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు కొట్టారు. ట్రావిస్ హెడ్ 174 బంతుల్లోనే 25 బౌండరీలు ఒక సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశారు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 268 బంతులు ఆడి 19 బౌండరీలు కొట్టి 121 పరుగులు చేశాడు. వీరికి తోడుగా అలెక్స్ కేరీ 69 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. కానీ టీమ్‌ఇండియాలో రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), చెతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) వెంటవెంటనే ఔటయ్యారు.
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేశ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టాయినిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా