JK Footbridge Collapse:


బేణి సంగమ్ వద్ద ప్రమాదం..


జమ్ముకశ్మీర్‌లో వైశాఖి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బెయిన్‌ గ్రామంలోని బేణి సంగమ్ వద్ద ఓ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులూ ఉన్నారు. పోలీసులతో పాటు మరి కొన్ని టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించాయి. ఒకేసారి భారీ మొత్తంలో భక్తులు బ్రిడ్జ్‌పైకి రావడం వల్ల కుప్ప కూలినట్టు పోలీసులు వెల్లడించారు. 


"ఈ ప్రమాదంలో కనీసం 80 మంది గాయపడ్డారు. వీరిలో 20-25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆరేడుగురిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించాం. మరి కొంత మందికి ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంది" 


- అధికారులు 










పైకప్పు కూలిన ఘటన..


అంతకు ముందు రోజు పూంఛ్‌లో ఓ ప్రమాదం జరిగింది. ఇంటి పైకప్పు కూలి 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖనేటర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున ఇంట్లోకి వచ్చిన సమయంలోనే పైకప్పు కూలింది. ఆ ఇంటి యజమాని కూతురు చనిపోయింది. ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు భారీ సంఖ్యలో ఇంటికి వచ్చారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక రూఫ్ కుంగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అవసరమైన చికిత్స అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. 


Also Read: UP Encounter List: యూపీ గ్యాంగ్‌స్టర్‌ల వెన్నులో వణుకు, యోగి హయాంలో 183 మంది ఎన్‌కౌంటర్