Singapore Drug Trafficking:
కిలో గంజాయి సరఫరా..
డ్రగ్ స్మగ్లింగ్. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వ్యాపారం ఇదే. అన్ని దేశాలూ ఈ అక్రమ రవాణాపై నిఘా పెడుతున్నప్పటికీ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. ఏదో ఓ మూల నుంచి తప్పించుకుని వచ్చి సరఫరా చేసేస్తున్నాయి ముఠాలు. ఇలాంటి వాళ్లు చిక్కితే ప్రభుత్వాలు చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో ఇప్పుడిదే జరుగుతోంది. ఈ లిస్ట్‌లో సింగపూర్ కూడా చేరిపోయింది. డ్రగ్స్ ముఠాలను వెతికి పట్టుకుంటున్నారు అక్కడి అధికారులు. ప్రభుత్వం మరణ శిక్ష విధించడానికీ వెనకాడటం లేదు. ఇటీవల డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తికి ఉరి శిక్ష విధించడం సంచలనమైంది. భారత్ మూలాలాన్న తంగరాజు సుప్పియ (46) డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతడి నుంచి దాదాపు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌లోని చంగీ జైల్లో పెట్టిన అధికారులు...ఆ తరవాత ఉరి తీశారు. ఈ మేరకు సింగపూర్ ప్రిజన్ సర్వీస్ అధికారిక ప్రకటన చేసింది. అతడిని క్షమించి వదిలేయాని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడు తంగరాజు కోర్టులో రివ్యూ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దాన్ని కొట్టేశారు. రివ్యూ చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను తంగరాజు కోర్టుకి ఇవ్వలేకపోయాడని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఉరి శిక్ష విధించాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు అధికారులు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతమూ లేదని స్పష్టం చేశారు.
సింపూర్‌లో ఇంతే..
సింగపూర్‌లో యాంటీ డ్రగ్స్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి శిక్షలు పడాల్సిందేనని తేల్చి చెబుతోంది. 2018 అక్టోబర్‌లోనే ఈ కేసులో తంగరాజుని దోషిగా తేల్చింది కోర్టు. అప్పటి నుంచి రివ్యూ పిటిషన్‌లు పెట్టుకున్నప్పటికీ దేన్నీ కోర్టు పట్టించుకోలేదు. సరైన ఆధారాలు లేవని ఆ పిటిషన్‌లను కొట్టి వేసింది. 2019 ఆగస్టులో అప్లై చేసినా లాభం లేకుండా పోయింది. ఫోన్ ద్వారా కొందరితో కమ్యూనికేట్ అవుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గతేడాది నవంబర్ నుంచి తనను విడుదల చేయాలంటూ వరుస పిటిషన్‌లు వేస్తూనే ఉన్నాడు తంగరాజు. కేసు నుంచి తప్పించుకునేందుకు అవసరం లేదని వాదనలన్నీ వినిపిస్తున్నారంటూ కోర్టు మండి పడింది. అయితే...సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సోషల్ యాక్టివిస్ట్‌లు తప్పు పడుతున్నారు. అమాయకుడిని చంపేశారంటూ విమర్శిస్తున్నారు. సింగపూర్‌లో ఇలా ఉంటే...థాయ్‌లాండ్‌లో గంజాయి సరఫరాను అధికారికంగా చేసుకోవచ్చని ప్రభుత్వమే అనుమతినిచ్చింది. చట్టాల్లో అలా మార్పులు కూడా చేసింది.
Also Read: Bihar News: 40 మంది మహిళలకు ఒక్కడే భర్త - కులగణనకు వెళ్లిన అధికారులు షాక్!