Hyderabad software enginner dies - హైదరాబాద్: ఏ టైమ్ కు ఏం జరుగుతుందో అసలు ఊహించలేం. ఆరోగ్యంగా ఉన్న వారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. అనుకోకుండా చావు అంచులకు వెళ్లిన వారు స్వల్ప గాయాలతో బయట పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వాటర్ సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతిచెందడంతో విషాదం నెలకొంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఈ ఘటన జరిగింది. హాస్టల్ యాజమానిపై కేసు నమోదు చేసి రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
షేక్ అక్మల్ (22) హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడు గచ్చిబౌలి లోని అంజయ్య నగర్ లోని షణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్‌లో ఉండేవాడు. ఆదివారం ఉదయం పండ్లు తెచ్చుకునేందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. హాస్టల్‌కు తిరిగొచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి లక్మల్ సంపు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో నీళ్లల్లో పడిన అతడు ఊపిరాడక మృతి చెందాడు. ఆ తరువాత హాస్టల్ నిర్వాహకులు ఇది గమనించారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్మల్ డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.