హైదరాబాద్ సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలికపై అఘాయిత్యం, హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని యాదాద్రి జిల్లాలో అరెస్టు పోలీసులు చేశారు. రాజు  స్వగ్రామం అడ్డగూడురులో అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో శుక్రవారం మృతి చెందింది. పక్కింట్లో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం దొరకడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పు మండలం డీసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పది బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.


అత్యాచారం ఆపై హత్య


ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు శుక్రవారం చంపాపేట నుంచి సాగర్‌ వెళ్లే రోడ్డులో నిరసన తెలిపారు. చివరికి కలెక్టర్‌ హామీతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, రెండు పడక గదుల ఇల్లు, ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని హైదరాబాద్ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు బాధితులకు అందించారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీఇచ్చారు. బాలిక మృతదేహాన్ని ఉస్మానియా మర్చురీలో పోస్టుమార్టం చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్య చేసినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 


కాలనీ వాసుల ఆందోళన


శుక్రవారం ఉదయం 7 గంటలకు చంపాపేట్ వద్ద సాగర్ రోడ్డుపై సింగరేణి కాలనీ వాసులు నిరసనకు దిగారు. చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు రాజును ఎన్​కౌంటర్​ చేయాలని లేదా తమకు అప్పగించాలని డిమాండ్ తో ఆందోళనకు దిగారు.​బాధిత కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసుల ఆందోళనతో పోలీసులను భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, కాలనీ వాసులకు వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, స్థానికులకు గాయాలయ్యాయి. 


Also Read: Hyderabad: హైదరాబాద్ లో దారుణ ఘటన... ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య...మృతదేహాన్ని పరుపులో చుట్టి నిందితుడు పరారీ


గొంతు నులిమి హత్య


యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన రాజుకు ఆరు నెలలుగా సైదాబాద్​లోని కాలనీలో నివాసం ఉంటున్నాడు. తాగుడుకు బానిసై భార్య, తల్లిని వేధించే వాడు. కొన్ని రోజులకు భార్య, తల్లి అతడిని వదిలివెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రాజు చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గురువారం సాయంత్రం చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి కీరాతకంగా చంపేశాడు. బాలిక మృతదేహాన్ని పరుపులో చుట్టి దూరంగా పడేద్దామని నిందితుడు భావించారు. వీలు కాకపోవడంతో గదిలో పెట్టి తాళం వేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం గాలించిన పోలీసులు.. అతడ్ని యాదాద్రి జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. 


Also Read: Mumbai Woman Rape: ముంబయిలో నిర్భయ తరహా ఘటన.. 45 ఏళ్ల మహిళపై కిరాతకంగా దాడి