Hyderabad News: వారిద్దరికి ఏడాదిన్నర క్రితమే పెళ్లి జరిగింది. అయితే ఉద్యోగరీత్యా ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు. హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇటీవలే భార్య ఇండియాకు వచ్చింది. భర్త అమెరికాలోనే ఉండగా.. హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహం ఇండియాకి రావడం అంత్యక్రియలు జరగడం కూడా పూర్తయింది. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య ఏం చేయాలో తెలియక మభావంగా ఉంటోంది. ఎవరైనా మాట్లాడించినా మాట్లాడడం మానేసింది. ఈ క్రమంలోనే భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాత రోజే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ బాగ్ అంబార్ పేట డీడీ కాలనీకి చెందిన 29 ఏళఅల సాహితికి వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఉద్యోగరీత్యా వీరు అమెరికా వెళ్లిపోయారు. డల్లాస్ లో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. అయితే కన్నవారిని చూసేందుకు సాహితీ ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ కు వచ్చింది. ఆమె వచ్చిన 18 రోజులకు అమెరికాలో మనోజ్ గుండెపోటుతో మృతి చెందాడు. భర్త మరణ వార్త తెలిసిన సాహితి తీవ్ర మనోవేదనకు గురైంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉంది. అయితే అమెరికా నుంచి మనోజ్ మృతదేహాన్ని ఈనెల 23వ తేదీన హైదరాబాద్ కు తీసుకువచ్చారు. బుధవారం రోజు వనస్థలిపురంలో మనోజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ తర్వాత సాహితి అంబర్ పేటలోని పుట్టింటికి వెళ్లింది. 


భర్త అంత్యక్రియలు ముగిసినప్పటి నుంచి సాహితీ కుటుంబ సభ్యలతో కూడా మాట్లాడడం మానేసింది. అయితే బుధవారం రోజు రాత్రి సాహితీకి తోడుగా ఆమె సోదరి సంజన పడుకుంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో సంజన వాష్ రూంకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చే లోపే సాహితి గది తలుపులు పెట్టుకొని ఉంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. చెల్లెలు సంజన తిరిగి వచ్చి తలుపు కొట్టినా ఎంతకీ తలుపులు తీయలేదు. కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టిట చూడగా అప్పటికే ఆమె చీరతో ఉరి వేసుకొని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త అంత్యక్రియలు ముగిసిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య చేసుకోవడంతో అంబర్ పేట డీడీ కాలనీలో విషాధ ఛాయలు అలముకున్నాయి. సాహితి మృతదేహాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.  


Also Read: పెళ్లి ఫిక్స్ అయింది, ప్రేమ గురించి తెలిసిపోయింది! - తట్టుకోలేక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య


గతేడాది సెప్టెంబర్ లో భార్య మృతి - తట్టుకోలేక రైలుకు ఎదురెళ్లిన భర్త



రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుఫ్రాఖుర్దు గ్రామంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణ, మమతలు దంపతులు. వీరికి 9 నెలల పాప కూడా ఉంది. అయితే తీవ్ర అనారోగ్యం పాలపైన భార్య మమత చనిపోయింది. మృత దేహాన్ని బంధువులు కారులో తీసుకు వస్తుండగా.. ముందుగా ఇంటికి వెళ్లి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు బాలకృష్ణ. ఏర్పాట్లు చేస్తానని చెప్పి వెళ్లిన బాలకృష్ణ.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద రైలుకు ఎదురుగా వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల మృతితో 9 నెలల చిన్నారి  అనాథగా మారింది.