హైదరాబాద్ లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. భరత్ నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థి నిన్న రాత్రి 7:30 గంటలకు ఉరి వేసుకుని విద్యార్థిని నవ్య ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ కూతురుది ఆత్మహత్య కాదని ఎవరో ప్రతి రోజు రాత్రి ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు చేశారని అందువల్లే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా తమ ఇంటి ముందు నిమ్మకాయలు, అగరుబత్తులు, కొబ్బరికాయలు పెట్టి వెళ్తున్నారని నవ్య కుటుంబ సభ్యుల ఆరోపణలు చేశారు. కేసు నమోదు చేసుకుని కుల్సుంపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
ABP Desam
Updated at:
08 Jun 2023 03:51 PM (IST)
తమ కూతురుది ఆత్మహత్య కాదని ఎవరో ప్రతి రోజు రాత్రి ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు చేశారని అందువల్లే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు.
ప్రతీకాత్మక చిత్రం