హైదరాబాద్‌లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది. డ్రగ్స్ అమ్మకాలు, వినియోగాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా... ప్రయోజనం కనిపించడంలేదు. డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఒక మార్గంలో హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా... రాయదుర్గంలో డ్రగ్స్ పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు. 32 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. రాజమండ్రికి చెందిన విక్కీతోపాటు అతని గ్యాంగ్‌లోని గోపిషెట్టి, రాజేష్, నరేష్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు.
విక్కీ గ్యాంగ్ గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్టు స్సెషల్ ఆపరేషన్ టీమ్.. ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు. సంపన్నులను టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్టు చెప్పారు పోలీసులు. డ్రగ్స్ దందాపై నిఘా పెట్టిన పోలీసులు... విక్కీ గ్యాంగ్ గురించి పూర్తి వివరాలు సేకరించారు. విక్కీ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు ఎస్‌వోటీ పోలీసులు. అయితే.. సంవత్సరం నుంచి ఎస్‌వోటీ పోలీసుల కళ్లు గప్పి... డ్రగ్స్ అమ్మకాలు చేపడుతోంది విక్కీ గ్యాంగ్. దీంతో.. ఈ గ్యాంగ్‌పై మరింత నిఘా పెట్టారు పోలీసులు. ఎట్టకేటలకు... రాయదుర్గంలో విక్కీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. విక్కీతోపాటు అతని గ్యాంగ్‌లోని గోపిషెట్టి, రాజేష్, నరేష్‌లను అరెస్ట్ చేశారు. ఈ నలుగురిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 32 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు.
విక్కీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... వారి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ ఎవరెవరికి అమ్మాకాలు.. ఇంకా ఎంత మంది పెడ్లర్లు ఉన్నారు.. అనే వివరాలు రాబట్టబోతున్నారు. సంపన్నులనే టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మినట్టు గుర్తించిన పోలీసులు... డ్రగ్స్ కొన్న ఆ సంప్నులు ఎవరు అనే అంశంపై కూడా దృష్టి పెట్టారు. వారి వివరాలు సేకరించబోతున్నారు. విక్కీ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొన్ని వారి లిస్ట్ ప్రిపేర్ చేసి... వారిపై కూడా యాక్షన్ తీసుకుంటారా..? అనేది ఉత్కంఠగా మారింది.
గోవాలో తక్కువ ధరకు కొకైన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు చెప్తున్నారు ఎస్‌వోటీ పోలీసులు. హైదరాబాద్‌లో వీకెండ్ పార్టీలు పెరిగిపోతున్నాయి. పబ్‌లు, శివారు ప్రాంతాల్లోని ఫాంహౌజ్‌లలో డ్రగ్స్ పార్టీల కోసం డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ వీకెండ్ పార్టీలో డ్రగ్స్‌కు డిమాండ్ ఉండటంతో... గ్రాము కొకైన్‌ను 20వేల రూపాయల నుంచి 30వేల వరకు అమ్ముకుంటున్నట్టు చెప్తున్నారు.