Hyderabad Crime News: అక్రమంగా సంపాధించి అయినా సరే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకొని కోటీశ్వరులవ్వాలనుకున్నారు. అందుకోసం ఆ అన్నాచెల్లెల్లు అడ్డదారి తొక్కారు. దొంనోట్లు తయారు చేయడం ప్రారంభించారు. కానీ చివరకు సోదరుడు పోలీసులకు చిక్కాడు. జైలు జీవితాన్ని అనుభవించాడు. కానీ వారి తీరులో మార్పు రాలేదు. బయటకు రాగానే మళ్లీ అదే పనిలో దిగాడు. చెల్లెలితో కలిసి దొంగనోట్ల సరపరా చేస్తూ రెండోసారి కూడా పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలోనే పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 


అసలేం జరిగిందంటే..?


మహారాష్ట్రకు చెందిన 35 ఏళ్ల కస్తూరి రమేష్ బాబు, 24 ఏళ్ల రామేశ్వరి సొంత అన్నాచెల్లెల్లు. ఉపాధి కోసం హైదరాబాద్ కు చేరిన వీరు బండ్లగూడ జాగీర్ లో మెకానిక్ షెడ్ ప్రారంభించారు. స్థానికంగా ఉండే యువతిని ప్రేమించి రమేష్ బాబు పెళ్లి కూడా చేసుకున్నాడు. లాక్ డౌన్ తో షెడ్ మూసేసి కారు డ్రైవర్ గా జీవితం ప్రారంభించాడు. ఇతడి చెల్లెలు రామేశ్వరి నగరంలోని ఓ వైద్య కళాశాలలో చదువుతోంది. అయితే వీరిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో.. ఎలాగైనా సరే సమస్యలు తొలిగంచుకోవాలి అనుకున్నారు. అక్రమంగా డబ్బులు సంపాధించేందుకు అదిరిపోయే ప్లాన్ వేశారు. నకిలీ నోట్లను తయారు చేస్తూ కోటీశ్వరులు అవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే తక్కువ ధరకు స్కానింగ్ మెషీన్, ప్రింటర్లు తీసుకొచ్చి రూ.500 నోటు స్కానింగ్ తీశారు. అది బెడిసికొట్టడంతో యూట్యూబ్ లోని వీడియోలతో నకిలీ నోట్లపై అధ్యయనం చేశారు. 


ఢిల్లీ వెళ్లి మరీ అవసరమైన సామగ్రి కొన్న అన్నాచెల్లెల్లు..


ఢిల్లీ వెళ్లి మరీ అందుకు అవసరమైన సామగ్రిని కొని తీసుకొచ్చారు. బండ్లగూడ జాగీర్ లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొనని రూ.100, 200, 500 నోట్లను తయారు చేయడం మొదలు పెట్టారా అన్నా చెల్లెల్లు. గత ఏడాది సెప్టెంబర్ లో వీరి బండారం బయటపడడంతో గోపాలపురం పోలీసులు రమేష్ బాబు, అంజయ్యను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలు రామేశ్వరి అజ్ఞాతంలోకి చేరి ముందస్తు బెయిల్ పొందింది. అయితే అదే జైలులో రమేష్ బాబుకు హత్యానేరంపై కస్టడీకి వచ్చిన ఫలక్ నుమా ఆటోడ్రైవర్ హసన్ బిన్ హమూద్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి నకిలీ నోట్ల మార్పిడికి ప్రణాళిక రూపొందించారు. జైలు నుంచి విడుదల అయ్యాక రమేష్ బాబు మకాం తాండూర్ మార్చాడు. ఆధునిక ప్రింటర్లు, రసాయనాల సాయంతో రూ.500 నోటును స్కానింగ్, లామినేషన్ చేసేవారు. ఆర్బీఐ ముద్ర రంగులు ఉండేలా పెద్ద ఎత్తున రూ.500 నకిలీ నోట్లను తయారు చేశారు. 


అన్న అరెస్టవడంతో చెల్లెలు అదిరిపోయే ప్లాన్..


రాత్రివేళ వీటిని తేలికగా మార్చేవారు. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ తదితర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని చలామమి ప్రారంభించారు. నకిలీ నోట్ల కేసులో ఈ ఏడాది జనవరిలో గుజరాత్ పోలీసులు రమేష్ బాబును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అన్న అరెస్టుతో అప్రమత్తమైన చెల్లలు రామేశ్వరి, హసన్ బి హమూద్ ను సంప్రదించింది. మకాం చాంద్రాయణగుట్టకు మార్చి నకిలీ నోట్లు, సామగ్రిని అక్కడికి తరలించారు. లక్షల రూపాయల విలువ అయిన నకిలీ నోట్ల చలామణికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిక శాతం కమీషన్ ఆశ చూపి దళారులు, ఏజెంట్లతో మళ్లీ దందా మొదలు పెట్టారు. ఈ క్రంలోనే దక్షిణ మండలం టాస్క్ ఫఓర్స్, చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం వచ్చింది. అందుకే వీళ్లు తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితులు పోలీసులకు చిక్కారు. నిందితుల వద్ద రూ.27 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు, ల్యాప్ ట్యాప్, ప్రింటర్లు, పింగ్ డీఏ లామినేటర్, రంగుల సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హసన్ బిన్ హమూద్ పై భవానీ నగర్, బహదూర్ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు ఉన్నాయి. నకిలీ నోట్ల గుట్టు చేధించిన ఇన్ స్పెక్టర్లు రాఘవేంద్ర, ప్రసాద్ వర్మ, టార్స్ ఫోర్స్ ఎస్ఐలు వి నరేందర్, ఎన్ శ్రీశైలం, షేక్ బురాన్, కె నర్సింలు, బృందాన్ని సీపీ సీవీ  ఆనంద్ కుమార్ అభినందించారు.