Hyderabad News : హైదరాబాద్  చందానగర్ లో స్కూల్ విద్యార్థితో టీచర్ ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థితో అదే స్కూల్ లో టీచర్ గా విధుల నిర్వహిస్తున్న యువతి ప్రేమాయణం నడిపింది. 27 సంవత్సరాల స్కూల్ టీచర్ పదో తరగతి చదువుతున్న విద్యార్థితో ప్రేమించినట్లు తెలుస్తోంది. పదిరోజుల క్రితం టీచర్, విద్యార్థి అదృశ్యమయ్యారు. మైనర్ అయిన తమ కుమారుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని  టీచర్ పై విద్యార్థి తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న చందానగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లలో ఇద్దరిపై మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.  ఏడాదిగా టీచర్, విద్యార్థి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పోలీసులు చెప్పారు. 


మైనర్ తో పెళ్లి, ఫస్ట్ నైట్ ఏకాంత చిత్రాలు వాట్సాప్ లో పెట్టిన భర్త!


ఇటీవల ఓ బాలికపై అయిదుగురు సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన మరువక ముందే అదే మండలంలో మరో అమానవీయ సంఘటన వెలుగు చూసింది. భర్తే ఇకపై నీకు సర్వస్వం అని చెప్పి మూడుముళ్ల బంధంతో తమ కుమార్తెను అప్పగించిన తల్లిదండ్రులకు ఆ అల్లుడు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఫస్ట్ నైట్ రోజు తన భార్యతో గడిపిన ఏకాంత చిత్రాలను సెల్ ఫోన్ లో తీసి వాట్సాప్ లో తన స్నేహితులకు పంపి రాక్షసానందం పొందాడు. పెళ్లి వయస్సు రాకపోయినా తమ కుమార్తెకు మంచి సంబంధం వచ్చిందని భావించి మైనర్ కు వివాహం చేసిన తల్లిదండ్రులు.. ఈ ఊహించని పరిణామంతో కంగుతిని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. 


అసలేం జరిగిందంటే..


డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Dr BR Ambedkar Konaseema District)లోని కాట్రేనికోన మండల పరిధిలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మైనర్ బాలికకు తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే తొలి రాత్రి గడుపుతుండగా చిత్రాలను తీసి భర్త వాట్సాప్ ద్వారా ప్రచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతడ్ని అరెస్ట్ చేసినట్లు కాట్రేనికోన ఎస్సై టి. శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామానికి చెందిన మైనర్ (Child Marriage With Minor Girl)ను మల్లాడి వీరబాబు ఈ ఏడాది ఫిబ్రవరి 8న వివాహం చేసుకున్నాడు. మొదటి రాత్రి ఆమెతో ఏకాంతంగా గడిపిన చిత్రాలను భర్త తన సెల్ ఫోన్ లో తీసుకున్నాడు. భర్త వాటిని వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపి ప్రచారం చేశాడు. ఇది కాస్తా బయటపడడంతో బాలిక కుటుంబానికి తెలిసింది. దాంతో అల్లుడి నిర్వాకంపై ఫిబ్రవరి 20న బాధితురాలి తల్లి కాట్రేనికోన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముమ్మిడివరం సీఐ ఎం.జానకిరామ్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 28న నిందితుడు మల్లాడి వీరబాబు అరెస్ట్ చేసి బుధవారం ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.