రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆరు కార్లు ఒకదాన్ని మరొకటి బలంగా ఢీ కొట్టాయి. ప్రమాదం నుంచి రేవంత్ క్షేమంగా బయటపడ్డారు. హాత్‌సేహాత్‌ పేరుతో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి భారీ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. 


రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో రేవంత్ క్షేమంగా బయటపడ్డారు. ఆయన వెళ్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదాన్ని ఒకటి గట్టిగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటన ఆరు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో బెలూన్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈ ప్రమాదంలో కొన్ని చానల్స్ రిపోర్ట్‌స్ కూడా ఉన్నారు. అంతా క్షేమంగా బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.