HCA Tickets Issue : భారత్-ఆస్ట్రేలియా టీ20 టికెట్ల వివాదం మరింత ముదిరింది. టికెట్లను బ్లాక్ లో అధిక రేట్లకు అమ్ముకుంటున్నారని ఇప్పటికే హెచ్సీఏపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది. తాజాగా జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాటకు హెచ్సీఏ నిర్వహణ లోపమే కారణమని మరో ఫిర్యాదు నమోదు అయింది. హెచ్సీఏ, అజారుద్దీన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. 


క్రిమినల్ కేసు నమోదు చేయాలి 


హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. వెంటనే అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని హెచ్ఆర్సీని కోరారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జ్ కి కారకులైన అజారుద్దీన్ తో పాటు HCA  నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం HCA తో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందన్నారు.  ఉప్పల్ లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు ఏర్పాట్ల విషయంలో HCA పూర్తి వైఫల్యం చెందిందని ఆరోపించారు.  


రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా 


క్రీడాభిమానుల నుంచి లక్షల, కోట్ల రూపాయలు దండుకొని టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయలేదని యుగంధర్ గౌడ్ ఆరోపించారు. జింఖానా గ్రౌండ్ వద్ద గాయపడిన బాధితులను HCA, ఇతర రాజాకీయ నాయకులు పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 


అజారుద్దీన్ పై కేసు నమోదు 


 భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా ఈనెల 25వ తేదీన జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తోపాటు మ్యాచ్ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకున్న ఆధారాలతో హైదరాబాద్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. తొక్కిసలాటలో గాయపడ్డ అదితి ఆలియా, ఎస్‌ఐ ప్రమోద్‌ ఫిర్యాదులతో కేసులు పెట్టారు. ప్రధానంగా హెచ్‌సీఏపై టికెట్‌ నిర్వాహణ, బ్లాక్‌లో విక్రయించారన్న ఆరోపణలపై సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమేనని గాయపడిన వారితో పాటు పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే గాయపడ్డ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Also Read : HCA Azharuddin : మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలికకాదు, జింఖానా ఘటనలో హెచ్సీఏ తప్పేం లేదు- అజారుద్దీన్


Also Read : IND Vs AUS Tickets: జింకానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జి - స్పృహతప్పిన పలువురు, మహిళకు సీరియస్!