హైదరాబాద్(Hyderabad) మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్(Police Station) పరిధిలో దారుణం జరిగింది. పదేళ్ల బాలుడిపై అరబిక్ ఉపాధ్యాయుడు(Arabic Teacher) లైంగిక దాడి చేశాడు. దారుల్ ఉలూమ్ మదర్సా(Madarsa) టీచర్ షోయబ్ అక్తర్ అనే అరబిక్ ఉపాధ్యాయుడు తమ బాలుడిపై లైంగిక దాడి చేశాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పదిరోజులు వరుసగా బాలుడిపై లైంగిక దాడి(Sexually Abuse) చేసినట్లు పోలీసులకు తెలిపారు. వెన్నునొప్పి ఎక్కువవడంతో బాలుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సా ముందు నిరసన చేశారు. రెండు నెలల క్రితమే దక్షిణాఫ్రికా(South Africa) నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు బాలుడి కుటుంబం. బాలుడికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగిక దాడికి పాల్పడిన అక్తర్ ను అరెస్ట్ చేశారు.
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు
విద్యార్థినులతో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విజయనగరం జిల్లా(Vizianagaram District)లో వెలుగుచూసింది. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల(Govt School)లో పని చేస్తున్న హెచ్‌ఎం ఎస్.స్వామినాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పవద్దని విద్యార్థులను బెదిరిస్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల గురించి చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించారు. సమాచారం అందుకున్న ఎంఈవో నారాయణ స్వామి పాఠశాలకు చేరుకొని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థినుల ఆరోపణలపై స్పందించిన ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి(Pushpa Sri Vani) గ్రామంలోని పాఠశాల వద్దకు చేరుకుని పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు, మహిళా పోలీసులను వివరాలు అడిగి తెలుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్(District Collector) ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
క్రిమినల్ కేసులు నమోదకు డిమాండ్
గిరిజన విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చూశారు. ఇవాళ సాయంత్రం ఆ గ్రామంలో ఆమె పర్యటించారు. ఎంఈవో నారాయణస్వామిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల పనితీరు సరిగాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న ఎల్విన్ పేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గిరిజన జేఏసీ నాయకులు, గిరిజన విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని ఫిర్యాదులు ఉన్నాయని జేఏసీ నేతలు అన్నారు.
Also Read: ఖి‘లేడీ’ కిల్లర్ - అమ్మాయిలను చంపేసి, శవాలతో కేకులు చేసుకుని తినేసింది, కారణం పెద్దదే!