Hyderabad Crime : హైదరాబాద్ లో ఖరీదైన బైక్ లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అఫ్జల్ గంజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గుమ్మడి చక్రవర్తి తెలిపారు. ఆయన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో మగ్గురు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుల నుంచి 13 ఖరీదైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రూ.17 లక్షల విలువ చేసే 5 బజాజ్ పల్సర్, 7 రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్లు, ఒక యమహా స్పోర్ట్స్ బైక్ సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహబూబ్ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు డీసీపీ చక్రవర్తి తెలిపారు.  



కర్ణాటక ముఠా


గత నెలలో రెండు బైకులు పోయాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు ఛేదించారు. ఈ ముఠాను గుర్తించి బీదర్ లో అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు ఆరుగురు కర్ణాటకలో నివాసం ఉంటున్నారు. అజార్, ఫేజిల్, మహునుడ్, సల్మాన్ బీదర్ కు చెందినవారు. ఈ ముఠాలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరంతా కర్ణాటకలో ఒకే ఏరియాలో ఉంటారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చి బైకులు చోరీ చేస్తు్న్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బైక్ పార్క్ చేసే విషయంలో యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. చోరీ చేసిన బైక్ లను తక్కువ ధరకు(రూ.30 వేలు) విక్రయిస్తున్నారు.  


తక్కువ ధరకే బైక్ అమ్మకం 


చోరీ చేసిన బైక్ లను లోన్ లో ఉన్నాయని నమ్మించి, తక్కువ ధరకు చోరీ చేసిన బైకులు విక్రయిస్తున్నారు దుండగులు. మహబూబ్ అనే నిందితుడిపై 2012లో పీడీ యాక్ట్ నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహబూబ్ తో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ చక్రవర్తి తెలిపారు. 


Also Read : Kakinada News : కేశవపురం పోస్టుమాస్టర్ ఘరానా మోసం, డిపాజిట్ దారుల సొమ్ముతో పరారీ


Also Read : CI Arrest : మొన్న డ్రగ్స్ కేసులో విచారణాధికారి - ఇప్పుడు లాడ్జీలో అడ్డంగా దొరికాడు ! ఈ సీఐ మామూలోడు కాదుగా