Husband kills wife with ex lover he met at school reunion:  స్కూల్ రీయూనియన్ లో కలిస్తే అందరూ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. హాయిగా గడపుతారు. అంత వరకూ ఉంటే పర్వాలేదు కానీ  కొన్నిపాత లవ్ స్టోరీలకు మళ్లీ చిగుళ్లు వస్తే కుటుంబాలు కూలిపోతాయి.. హత్యలు జరిగిపోతాయి. దానికి ఈ కేసే సాక్ష్యం. 

కేరళలోని   తిరువనంతపురంలో  విద్య అనే మహిళ మిస్ అయింది. ఆమె భర్త కన్నీరు పెడుతూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఓ కోణంలో ఎంత అన్వేషించినా ప్రయోజనం లేకపోయింది. కానీ చివరికి భర్త వైపు నుంచే దర్యాప్తు చేయడంతో క్లూ దొరికింది.  

ప్రేమ్‌కుమార్, విద్య భార్యభర్తలు.  అయితే ప్రేమ్ కుమార్ , సునీత  బాల్య స్నేహితులు.  వెల్లరడలోని LMS స్కూల్‌లో తొమ్మిదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత, 2018లో జరిగిన స్కూల్ రీయూనియన్‌లో వారు మళ్లీ కలుసుకున్నారు. ఈ రీయూనియన్ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ్‌కుమార్ తరచూ తిరువనంతపురంలో సునీతను కలవడానికి వచ్చేవాడు. సునీత, తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసేది. తర్వాత వారు తిరువనంతపురంలోని త్రిపునితురలో ఒక  ఇంటిలో సహజీవనం ప్రారభించారు.  వారి సంబంధం గురించి ఓ సారి ప్రేమ్ కుమార్ భార్య విద్యకు తెలిసింది.            

దాంతో విద్యను చంపాలని నిర్ణయించుకున్నారు.   తిరువనంతపురంలోని పేయాడ్‌లోని ఒక విల్లాకు తీసుకెళ్లారు. అక్కడ  విద్యకు మద్యం తాగించారు.   తర్వాత, ప్రేమ్‌కుమార్ ఆమె  గొంతు పిసికి చంపేశాడు.  ఆ తర్వాత, సునీత సహాయంతో ఆమె శవాన్ని తమిళనాడులోని తిరునెల్వేలి అడవి ప్రాంతంలో పడేశారు.  విద్య ఆచూకీ తెలియకుండా పోయిందని చూపించడానికి, ప్రేమ్‌కుమార్   మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు.   మిస్సింగ్ కేసు విచారణలో, పోలీసులు ప్రేమ్‌కుమార్ ,  సునీతల సంబంధం గురించి సమాచారం సేకరించారు. వారి కుట్ర గురించి ఆధారాలు లభ్యమైన తర్వాత, ఇద్దరినీ అరెస్టు చేశారు.                                

ప్రేమ్ కుమార్, సునీత కలిసి విద్యను చంపి శవాన్ని మాయం చేసిన ఘటన ఇప్పుడు జరిగింది కాదు.. ఇటీవల కోర్టు వీరి నేరాన్నిఖరారు చేసింది. శిక్షలను ఖరారు చేయాల్సి ఉంది. వీరు విద్య శవాన్ని మాయం చేసిన వ్యవహారం పూర్తి స్థాయిలో దృశ్యం సిని్మా కథను పోలి ఉంది. శవాన్ని తమిళనాడు అడవుల్లో పడేయమే కుండా..తర్వాత అసలేమీ జరగనట్లుగా తర్వాత రోజుల్లో వీరు పనులు వీరుచేసుకున్నారు. అందరూ అనుమానిస్తారని ఓ ఫిర్యాదు పోలీసుల వద్ద పడేశారు. కానీ పోలీసులు తమ మీద అనుమానిస్తారని ఊహించలేకపోయారు. కేరళ నేరాల చరిత్రలో .. ఈ కేసు ఓ కేస్ స్టడీగా నిలుస్తుందని నేర నిపుణులు చెబుతున్నారు.