Police crack dead body case in suit case : హైదరాబాద్‌లోని బాచుపల్లిలో, రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడిన వ్యవహారంలో పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందిడుతు నేపాల్ కు చెందిన విజయ్ . హతురాలు కూడా నేపాల్ కు చెందిన వారే. ఇద్దరూ కలిసి హైదరాబాద వచ్చారు. కొన్ని రోజులు ఎంజాయ్ చేశారు. తర్వతా ఏమయిందో కానీ విజయ్ తన లవర్ ను చంపేశాడు. ఏం చేయాలో తెలియక పెద్ద సూట్ కేస్ కొని అందులో ఆమెను పెట్టి.. బాచుపల్లి వద్ద రోడ్ పక్కన పడేసి నేపాల్ పారిపోయాడు.
సూట్ కేసులో మృత దేహం గురించి సమాచారం రావడంతో బాలానగర్ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పంపించారు. హత్య కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్, మిస్సింగ్ కేసుల పరిశీలన, వేలిముద్రల విశ్లేషణ ద్వారా పోలీసులు కేసును చేధించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించలేదు. హతురాలు.. నిందితుడు ఇద్దరూ నేపాల్ వాళ్లు కావడంతో వాళ్ల రికార్డులేమీ లభించలేదు. కానీ సీసీ కెమెరా దృశ్యాలతో పోలీసులు కేసును చేధఇంచారు.