Uttarakhand Crime News:  కన్న తల్లి ఇలాంటి ఘోరం చేయిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఆ తల్లి. ఆమె అనామిక శ్రమ. ఉత్తరాఖండ్ లో బీజేపీ నేత.   సుమిత్ పట్వాల్‌ అనే తన లవర్ తోపాటు మరి కొంత మందిని తన కుమార్తెపై అత్యాచారం చేయించింది.  మార్చి 2025 వరకు ఎనిమిది సార్లు ఇలాంటి ఘటన జరిగింది.  ప్రతి సందర్భంలో,  తన కుమార్తెకు ఇవన్నీ "సాధారణం" అని చెప్పి ఈ దారుణానికి బలవంతం చేసినట్లుగా తెలుస్తోంది.  ఈ చర్యలను సమర్థించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

హరిద్వార్‌లోని చిత్ర టాకీస్ లేన్‌లో అనమికా శర్మ , సుమిత్ పట్వాల్ కలిసి లీజుపై నడుపుతున్న హోటల్‌లో ఈ అత్యాచారాలు జరిగినట్లు పోలీసులు  గుర్తించారు.  రణిపూర్ పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.   బాధితురాలి వైద్య పరీక్షలు నిర్వహించారు .   కోర్టు ముందు ఆమె వాంగ్మూలం నమోదు చేయింారు. నిందితుల్ని   జుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో  మాజీ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలైన అనమికా శర్మ , ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్‌ తో పాటు అతని   స్నేహితుడు కూడా  లైంగిక దాడుల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు.   అనమికా శర్మ తన భర్త నుంచి విడిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె తల్లితో.. కుమారుడు తండ్రితో ఉంటున్నారు.   కుమార్తెను తన వద్దే పెట్టుకుని సుమిత్ పట్వాల్‌తో కలిసి సహజీవనం ప్రారంభించారు. బాధితురాలు సుమారు ఒక నెల పాటు తన తండ్రి వద్ద ఉండటానికి వెళ్లినప్పుడు  ఆమె పరిస్థితిని  తండ్రి గమనించాడు.  ఏం జరిగిందో చెప్పాలని తండ్రి అడిగినప్పుడు తన పరిస్థితిని వివరించింది. తల్లి చేయిస్తున్న దారుణాలను వెల్లడించింది. ీదంతో  జూన్ 3, 2025న, బాధితురాలి తండ్రి ఆమెను రణిపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఈ కేసు సంచలనం సృష్టించండతో   బీజే పీ అనమికా శర్మను పార్టీ నుండి తొలగించింది. ఆమె గతంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసింది.