UP Crime News: ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక భర్త పిచ్చిపట్టినట్టు తన భార్యను హత్య చేశాడు ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. తర్వాత ఆమె శరీర ముక్కలను సమీపంలోని కాలువలో చేపలకు తినిపించాడు. ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలను కాల్చివేశాడు. వరకట్నం వేధింపులతోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
శ్రావస్తీ జిల్లా హర్దత్‌నగర్ గిరిన్త్‌లోని జబ్దీ గ్రామానికి చెందిన సయ్యదుద్దీన్ తన భార్య ముకిన్ అలియాస్ సబీనాను ఇంటి నుంచి లక్నోకు తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలోనే తన భార్యను హత్య చేశాడు. తర్వాత ముక్కలు చేసి, కాల్చివేశాడు. సోదరుడు సలాహుద్దీన్ తన సోదరికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. అతను ఇంటికి వచ్చినప్పుడు భర్తే తీసుకెళ్లినట్టు స్థానికులు చెప్పారు. లక్నోకు తీసుకెళ్లాడని చెప్పారు. కానీ సాయంత్రానికి సయ్యద్దిన్ అక్కడే తిరుగుతూ కనిపించాడు.
పోలీసుల జోక్యంతో నిందితుడు నేరం ఒప్పుకున్నాడుకుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది కాబట్టి మంగళవారం సలాహుద్దీన్ తన సోదరి మిస్సింగ్ కేసును పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశాడు. పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించగా సయ్యద్దిన్ దొరికాడు. సయ్యదుద్దీన్ రెండు రోజులు పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఈ రోజు పోలీసుల తమ స్టైల్‌లో విచారించడంతో తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
పోలీసులు మృతురాలి చేతిని స్వాధీనం చేసుకున్నారునిందితుడు చెప్పిన ప్రకారం పోలీసులు ఆ ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ పోలీసులకు మృతురాలు సబీనా సగం కాలిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పోలీసులు నిందితుడు సయ్యదుద్దీన్ ను అరెస్టు చేసి, కేసులో మరింత దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ అధికారి ఘన్‌శ్యామ్ చౌరసియా మాట్లాడుతు... భార్యను హత్య చేసిన సయ్యదుద్దీన్ అరెస్టు చేసినట్టు తెలిపారు. సయ్యదుద్దీన్ ముందుగా తన భార్యను ముక్కలు చేసి, ఆ తర్వాత కాల్చివేశాడు. దానిలో కొంత భాగం ఆ ప్రదేశంలో దొరికింది. పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.